Dominican Republic: నైట్ క్లబ్ భవనం ఘటనలో పెరుగుతోన్న మృతులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:14 PM
Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని నైట్ క్లబ్ భవనం పైకప్పు కుప్పుకూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంఖ్య 218కి చేరింది. అలాగే గాయపడిన వారి సంఖ్య సైతం పెరిగింది. వీరంతా ఆ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోన్నాయి.

శాంటో డొమింగో, ఏప్రిల్ 10 : డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని నైట్ క్లబ్ భవనం పై కప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 184 మంది మృతి చెందగా.. ఇంకా శిథిలాల కింద అనేక మంది చిక్కుకు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 218 మంది వరకు మరణించి ఉంటారని సమాచారం.
రాజధాని శాంటో డొమింగోలోని జెట్ సెట్ క్లబ్‌లో మంగళవారం తెల్లవారుజామున ప్రముఖ మురాంగే గాయకుడు రూబీ పెరెజ్ ప్రదర్శ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే భవనం పైకప్పు నుంచి సన్నటి సిమెంట్ పొడి రాలడం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు దీనిని కాస్తా లైట్‌గా తీసుకున్నారు. ఆ కొద్ది సేపటికే ఆ భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
అయితే ఉన్నతాధికారుల సమక్షంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోన్నాయి. ఈ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో ఇప్పటి వరకు 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిని నగరంలోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
డొమినికన్ రిపబ్లిక్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఇక ఈ ఘటనలో పలువురు అదృశ్యమైనట్లు గుర్తించారు. ఆ క్రమంలో వారి కోసం శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ చర్యలు యుద్ధ ప్రాతిపాదికన సాగుతోన్నాయి. ఇక మృతుల్లో మురాంగే గాయకుడు రూబీ పెరెజ్ సైతం ఉన్నారు.
For International News And Telugu News