Share News

DF 41: చైనా అమ్ములపొదిలో శక్తిమంతమైన క్షిపణి

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:38 PM

భారత్, రష్యా సంయుక్తంగా నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్షిపణిగా ఖ్యాతి పొందింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మూకల స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌లో సైతం ఈ బ్రహ్మోస్ క్షిపణి కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే.

DF 41: చైనా అమ్ములపొదిలో శక్తిమంతమైన  క్షిపణి
DF 41 in China

బీజింగ్, ఆగస్టు 27: భారత్, రష్యా సంయుక్తంగా నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్షిపణిగా ఖ్యాతి పొందింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మూకల స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌లో సైతం ఈ బ్రహ్మోస్ క్షిపణి కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే. అయితే డీఎఫ్ 41 క్షిపణిని చైనా రూపొందించింది. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సైతం దీర్ఘ శ్రేణి సామర్థ్యాల రేసులో ముందు వరుసలో ఉంది. 12 వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించ గల పరిధితోపాటు స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకో గల వార్ హెడ్‌ను దీనికి అమర్చారు. ఈ డీఎఫ్ 41.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఆయుధశాలలో అత్యంత అధునాతన ఆయధంగా ప్రస్తుతం దీనిని పరిగణిస్తున్నారు.


1986లో డీఎఫ్ 41 క్షిపణిని అభివృద్ధి చేశారు. 2017లో సేవలోకి ప్రవేశించిన ఈ క్షిపణి.. 2019లో బహిరంగంగా తొలిసారిగా ప్రదర్శించారు. అనంతరం 2024, సెప్టెంబర్‌లో ఈ క్షిపణిని దక్షిణ మహాసముద్రంలో పరీక్షించారు. దాంతో ఈ క్షిపణి దీర్ఘ శ్రేణి సామర్థ్యాన్ని నిరూపించినట్లు అయింది. ఇది 80 వేల కిలోల బరువు, 22 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ క్షిపణినిని ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలను సైతం లక్ష్యంగా చేసుకుని ప్రయోగించ వచ్చు. ఈ క్షిపణి అనేక సాంకేతిక ప్రత్యేకతలు కలిగి ఉండడం గమనార్హం.


ఈ డీఎఫ్ 41.. క్షిపణి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఉంది. ఇది అమెరికా, రష్యాలకు చెందిన క్షిపణులతో సైతం పోటీ పడుతుంది. ఈ క్షిపణి చైనా రక్షణ సామర్థ్యాలు పెంచడమే కాకుండా.. అంతర్జాతీయ భద్రతపై సైతం ప్రభావితం చేస్తుంది. ఈ డీఎఫ్ 41 క్షిపణులను 50 నుంచి 100 యూనిట్ల వరకు తయారు చేయాలని భావిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కొండ చరియలు విరిగిపడి.. 30 మంది మృతి

భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు

For International News And Telugu News

Updated Date - Aug 27 , 2025 | 12:43 PM