Share News

Chinmoy Krishna Das Case: చిన్మయ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారమే

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:33 PM

బెయిలు కోరుతూ చిన్మయ్ కృష్ణ దాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంనాడు విచారణకు రాలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

Chinmoy Krishna Das Case: చిన్మయ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారమే

ఢాకా: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారంటూ 'దేశద్రోహం' ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న 'బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతని జాగరణ్ జోతె' ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ (Chinmoy Krishna Das)కు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిలు కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంనాడు విచారణకు రాలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. చిన్మయ్ బెయిలు పిటిషన్‌ను చిట్టగాండ్‌లోని దిగువ కోర్టు జనవరి 2న తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Donald Trump: ఇండియా టైం ప్రకారం ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే.. ఈ ఛానెళ్లలో లైవ్..


కాగా, చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ జనవరి 12న హైకోర్టులో పిటిషన్ వేశామని, 20న విచారణకు రావాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. అయితే, పెండింగ్‌ కేసులను సీరియల్ ప్రకారం కోర్టు విచారణ జరుపుతుందని, ఆ ప్రకారం వచ్చే వారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కేసులను ఆది, సోమవారాల్లో మాత్రమే హైకోర్టు విచారణ జరుపుతుందని చెప్పారు.


'ఇస్కాన్' మాజీ ప్రచారకర్తగా ఉన్న చిన్మయ్ దాస్‌ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరిచారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ చిన్మయ్‌పై దోశద్రేహం కేసు నమోదు కావడంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జైలుకు పంపుతూ ఆదేశాలిచ్చింది. దీంతో కోర్టు వెలువల ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనను విడిచిపెట్టాలంటూ హిందూ అనుకూల వాదులు, ఆయన అనుయాయులు ఆందోళనకు దిగారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. చిన్మయ్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢాకా, ఇతర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.


Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..

UNICEF: 2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు.. సేవ్ చేయలేమా..

Read More International News and Latest Telugu News

Updated Date - Jan 20 , 2025 | 05:36 PM