Share News

Justin Trudeau: ట్రంప్‌ సుంకాలు విధిస్తే భయపడం, ఊరుకోం

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:50 AM

కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం సుంకాన్ని వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రుడో ధీటుగా స్పం దించారు.

Justin Trudeau: ట్రంప్‌ సుంకాలు విధిస్తే భయపడం, ఊరుకోం

కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం సుంకాన్ని వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రుడో ధీటుగా స్పం దించారు. ట్రంప్‌ సుంకాలు విధించినంత మాత్రానా భయపడమని, తామేంటో ఆయనకు చూపిస్తామని, కెనడా పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, కెనడా నుంచి అమెరికాలోకి చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఫెంటనిల్‌ రవాణా జరుగుతోందని ట్రంప్‌ చేసిన ఆరోపణలపైనా ట్రుడో స్పందించారు. సరిహద్దులో భద్రత పెంపు అంశంపై చర్చలు జరిపేందుకు కెనడా ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ఇక, కెనడాలోని సహజ వనరులను వినియోగించుకోకుండా అమెరికా బలమైన ఆర్థిక శక్తిగా నిలబడలేదనే విషయాన్ని ట్రంప్‌ మరచిపోకూడదని వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి..

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు

influential Indians : సత్యం.. సుందరం!

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 23 , 2025 | 05:37 AM