Foreign Students: కెనడా స్టడీ పర్మిట్లలో 10శాతం కోత
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:24 AM
ప్రస్తుత సంవత్సరానికి గాను 4,37,000 స్టడీ పర్మిట్లను కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ(ఐఆర్‌సీసీ) ప్రావిన్స్‌ల వారీగా కేటాయింపులు ఖరారు చేసింది.

అట్టవా, ఫిబ్రవరి 2: విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే స్టడీ పర్మిట్లలో కెనడా కోత విధించింది. ప్రస్తుత సంవత్సరానికి గాను 4,37,000 స్టడీ పర్మిట్లను కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ(ఐఆర్‌సీసీ) ప్రావిన్స్‌ల వారీగా కేటాయింపులు ఖరారు చేసింది. ఇది మునుపటి సంవత్సరంకంటే 10శాతం తక్కువ. కాగా, విదేశీ విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో ఇళ్ల కొరత, ఆరోగ్య సంరక్షణ, పౌరసేవల లభ్యతపై ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కెనడా ప్రభుత్వం 2024లో తొలిసారిగా స్టడీ పర్మిట్లపై పరిమితిని అమలు చేసింది. దీనిద్వారా తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 40 శాతం వరకూ తగ్గించింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి