Share News

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

ABN , Publish Date - Sep 29 , 2025 | 07:51 PM

ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆనందసంగరీ తెలిపారు.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
Lawrence Bishnoi gang

ఒట్టావా: కెనడా (Canada) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. కెనడా ప్రజా భద్రతా శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరీ (Gary Anandasangaree) సోమవారంనాడు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. దీంతో కెనడాలోని ఈ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.


నేరాలకు అడ్డుకట్ట వేసేందుకే..

ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆనందసంగరీ తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ ప్రాథమిక భాద్యత అని, కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని హింస, భయోత్సాత్పం, బెదిరించడం వంటి చర్యలకు బిష్ణోయ్ గ్యాంగ్ పాల్పడుతోందని చెప్పారు. ఈ గ్రూప్‌ను లిస్టింగ్ చేయడం ద్వారా వాళ్ల నేరాలను మరింత శక్తివంతగా ఎదుర్కొంటామని తెలిపారు.


ఇండియా మూలాలున్న అంతర్జాతీయ నేర ముఠాగా పేరున్న బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో వేళ్లూనుకుంది. భారతీయ సంతతి జనాభా కూడా కెనడాలో గణనీయంగా నివసిస్తోంది. ఈ క్రమంలో తమ పట్టు పెంచుకునేందుకు బిష్ణోయ్ ముఠా హత్యలు, కాల్పులు, దహనకాండలు, లూఠీలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు వంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతోంది. ప్రముఖ కమ్యూనిటీ సభ్యులు, వాణిజ్య, సాంస్కృతిక నేతలను కూడా టార్గెట్ చేసుకుంటోంది. దీంతో పలు వర్గాల్లో అభద్రతా భావం నెలకొంది.


ఇవి కూడా చదవండి..

ట్రంప్‌కు ఏమైంది?.. మరీ ఇంత దారుణమా.. ఈ సారి సినిమాలు..

పాక్ ప్రధానికి ఊహించని షాక్.. పీఓకేలో తిరగబడ్డ ప్రజలు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 07:54 PM