Ukraine: నాటో సభ్యత్వం ఇస్తే నా పదవి వదులుకునేందుకు రెడీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Feb 23 , 2025 | 10:22 PM
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం తాను తన పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు తాను తన పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం అన్నారు. తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ల చర్చల్లో మధ్యవర్తిగా కాకుండా తమ దేశ భాగస్వామిగా అమెరికాను చూడాలనుకుంటున్న వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉండాలని తానేమీ కోరుకోవట్లేదని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై రేపటికి మూడు సంవత్సరాలు గడస్తుందనగా రష్యా ఉక్రెయిన్‌పై అతిభారీ డ్రోన్ దాడికి దిగింది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి (Ukraine).
Donald Trump - BRICS: నా వార్నింగ్‌కు బ్రిక్స్ కూటమి ‘విచ్ఛిన్నమైపోయింది’: డొనాల్ట్ ట్రంప్
ఇదిలా ఉంటే, రష్యా అధ్యక్షుడు పుతిన మాటలను ఎవరూ నమ్మకూడదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. ఆయన చేతల్ని చూసి ఓ అంచనాకు రావాలని సూచించారు.
మరోవైపు, యుద్ధం మొదలై మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో దీనికి ముగింపు పలకాలని యూఎన్ సెక్రెటరీ జనలర్ అన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా శాంతి ఒప్పందం ఉండాలని అభిలషించారు.
Donald Trump: భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం
ఏమిటీ నాటో
నాటో అంటే పశ్చిదేశాల సైనిక కూటమి. 1949లో 12 దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. తమలో ఒకరిపై దాడి జరిగితే మిగతా వారందరూ మద్దతుగా రంగంలోకి దిగాలనేది ఈ కూటమి సభ్య దేశాల మధ్య ఉన్న ఒప్పందం. ప్రస్తుతం నాటో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. ఇటీవలే ఫిన్‌లాండ్ నాటోలో చేరింది. ఉక్రెయిన్ కూడా నాటో సభ్యత్వం కోరుతున్నా రష్యా మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్ సభ్యత్వం ఇస్తే నాటో దళాలు ఏకంగా తమ సరిహద్దుకు అత్యంత సమీపంలోకి వస్తాయని రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి