Share News

Big Palace: బాబోయ్.. ఇంత పెద్ద భవనమా.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే..!

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:17 PM

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది? అంటే మొట్టమొదటగా గుర్తుకువచ్చేది ముఖేష్ అంబానీ నివాసం. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. రూ.15,000 కోట్ల విలువ కలిగిన ఈ ఇంటిపేరు..

Big Palace: బాబోయ్.. ఇంత పెద్ద భవనమా.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే..!
Buckingham Palace

లండన్, అక్టోబర్ 07: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది? అంటే మొట్టమొదటగా గుర్తుకువచ్చేది ముఖేష్ అంబానీ నివాసం. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. రూ.15,000 కోట్ల విలువ కలిగిన ఈ ఇంటిపేరు ఆంటిలియా. ముంబై దక్షిణ భాగంలో 27 అంతస్తుల్లో ఈ ఇంటిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ ఆంటిలియా భవనంలో 600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల కోసం ఒక ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించారంటే ఎంత పెద్ద భవనమో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ భవనం కంటే కూడా అతిపెద్ద భవనం కూడా మరొకటి ఉంది. దాని గురించి తెలిస్తే బాబోయ్ అని నోరెళ్లబెడతారంతే..


ముఖేష్ అంబానీ ఇల్లు కంటే అత్యంత పెద్దదైన భవనం లండన్ నగరంలో ఉంది. బ్రిటన్ రాయల్టీకి చెందిన ఈ ఇంటి పేరు బకింగ్‌హామ్ ప్యాలెస్. బ్రిటిష్ రాజవంశానికి అధికారిక నివాసంగా ఈ భవనం ప్రఖ్యాతి చెందింది. ఈ ప్యాలెస్‌లో మొత్తం 775 గదులు, 78 బాత్రూములు, 1,500 తలుపులు ఉన్నాయి. సువిశాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇందులో రాజవంశీయుల కోసం 52 బెడ్‌రూమ్‌లు, 188 గదులు అతిథుల కోసం, 92 ఆఫీసులుగా కేటాయించారు.

Buckingham-Palace-2.jpg


అయితే ఈ ప్యాలెస్ బ్రిటన్ రాయల్టీ సొంతమని చాలామందిలో ఒక అపోహా ఉంది. ఈ ప్యాలెస్ రాయల్టీకి చెందినది కాదని.. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వానికి చట్టపరంగా చెందిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాలెస్ బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలో ఉందని, వ్యక్తిగతంగా రాజవంశానికి చెందినది కాదని స్పష్టం చేసింది. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ ప్యాలెస్ మొత్తం 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని పొడవు 108 మీటర్లు, వెడల్పు 120 మీటర్లు ఉంటుంది. ఇందులో 1514 తలుపులు, 760 కిటికీలు, 350కు పైగా గడియారాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్యాలెస్ బేస్‌మెంట్‌లో ఓ ప్రైవేట్ ఏటీఎం కూడా ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పవచ్చు.

Buckingham-Palace-3.jpg


అత్యంత ఖరీదైన ఈ భవనాన్ని సుమారు 300 ఏళ్ళ క్రితం బకింగ్‌హామ్ డ్యూక్ నిర్మించారు. అయితే 1837లో క్వీన్ విక్టోరియా ఈ ప్యాలెస్‌ను అధికారిక నివాసంగా మార్చారు. ఈ ప్యాలెస్‌లో 800 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ భవనంలో ప్రత్యేక ప్రార్థనా మందిరం, పోస్టాఫీస్, హాస్పిటల్, వినోదం కోసం సినిమా హాల్ ఉన్నాయి. అలాగే, 40 ఎకరాల ప్రైవేట్ ఉద్యానవనం, హెలిప్యాడ్, ప్రైవేట్ సరస్సు కూడా ఉన్నాయి. ప్యాలెస్‌లో ఎలక్ట్రిసిటీ 1883లో ప్రారంభమైంది. బ్రిటిష్ చరిత్ర, సంప్రదాయం, అధికార ప్రతీకగా వెలుగొందుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ప్రపంచంలో అత్యంత విలువైన ఇంటిగా గౌరవం దక్కుతుంది.

Buckingham-Palace-4.jpg


Also Read:

ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు అధికారిక బంగ్లా

ఫిజిక్స్‌లో ముగ్గురికి ఈ ఏడాది నోబెల్ ప్రైజ్

For More International News and Telugu News..

Updated Date - Oct 07 , 2025 | 04:17 PM