Share News

Statue of Liberty Smashed: కూలిన 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:33 AM

బ్రెజిల్‌లో వీచిన బలమైన గాలుల ధాటికి 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహం కూలింది. 24 మీటర్ల విగ్రహం ఛిద్రమైన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Statue of Liberty Smashed: కూలిన 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Statue of Liberty Smashed

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌(Brazil)లోని గ్వాయిబా(Guaiba) నగరంలో తుపాను సృష్టించిన బీభత్సానికి అక్కడి 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' కూలిపోయింది(Statue of Liberty). బలమైన గాలుల కారణంగా 24 మీటర్ల(78 అడుగులు) ఎత్తున్న విగ్రహం తొలుత వంగి, ఆ తర్వాత నేలకొరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రతిమ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రియో గ్రాండే డో సుల్ మెట్రోపాలిటన్ ప్రాంత భాగమైన పోర్టో అలెగ్రే సమీపంలోని గ్వాయిబాలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విగ్రహం కూలిపోయే సమయంలో దాని తల ముక్కలయింది. విగ్రహం మొత్తం 40 మీటర్లు(114 అడుగులు) ఉండగా.. స్థానిక నివేదికల ప్రకారం.. 24 మీటర్లుగా కొలిచే పైభాగం ప్రతిమ మాత్రమే ఛిద్రమైందని, 11 మీటర్లు(36 అడుగులు) పీఠభాగం ఏమాత్రం చెక్కు చెదరలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పలు వాహనాలను పార్క్ చేసినట్టు తెలుస్తోంది. స్థానిక అధికారులు వెంటనే ప్రతిస్పందించడంతో అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.


'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహం కూలిపోవడంతో(Statue of Liberty Smashed).. దీనిపై అంతర్గత దర్యాప్తు చేపట్టారు అధికారులు. విగ్రహం కూలడానికి తీవ్రమైన వాతావరణ పరిస్థితులే కారణమా లేక ఇతర అంశాలు ఏమైనా ప్రభావం చూపాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వివరించారు.


ఇవీ చదవండి:

రోడ్డుపై బస్సుల్లో మంటలు.. పలువురు సజీవ దహనం.!

చిన్నారిపై హత్యాచారం కేసు.. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ

Updated Date - Dec 16 , 2025 | 12:02 PM