Indian High Commission Advisory: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. భారత హైకమిషన్ కీలక సూచన
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:00 AM
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత హైకమిషన్ అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని భారతీయులు ఇళ్లల్లోంచి అనవసరంగా బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సందర్భాల్లో తమను సంప్రదించాలని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: బాంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారత హైకమిషన్ భారతీయులను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయులు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్ లేదా అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని సూచించింది (Indian High Commission in Bangladesh Advisory).
ఉద్రిక్తంగా పరిస్థితులు
భారత వ్యతిరేక వ్యాఖ్యలతో పాప్యులారిటీ సాధించిన ఇక్వింలాబ్ మంచ్ సంస్థ నాయకుడు ఉస్మాన్ హైదీ మృతి వార్త నిన్న బంగ్లాదేశ్‌లో కలకలం రేపిన విషయం తెలిసింది. రాత్రి వేళ ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు నిరసనలకు తెరతీశారు. కొన్ని స్థానిక పత్రికలకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. కార్యాలయాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఇక చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఎదుట కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజీబ్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు పరిస్థితి అదుపు చేసేందుకు ప్రభుత్వం పారామిలిటరీ దళాలను కూడా మోహరించింది. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన కాల్పుల్లో హైదీ గాయపడ్డ విషయం తెలిసిందే. సింగపూర్‌లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. నేటి సాయంత్రం హైదీ మృత దేహాన్ని బంగ్లాదేశ్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీంతో, అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.
ఇవీ చదవండి:
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్ సతమతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి