TB Vaccine: క్షయకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకా.. త్వరలో మనుషులపై ట్రయల్స్
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:59 AM
శాస్త్రవేత్తలు ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. క్షయకు కారణమైన బ్యాక్టీరియాపై ఈ టీకా సమర్థవంతంగా పోరాడి.. ఎలుకల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 22: క్షయ వ్యాధి నివారణకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ టీకా ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. శాస్త్రవేత్తలు ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. క్షయకు కారణమైన బ్యాక్టీరియాపై ఈ టీకా సమర్థవంతంగా పోరాడి.. ఎలుకల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీంతో ఈ టీకాను మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు తొలిసారిగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధి జరిగింది. కాగా, ప్రస్తుతం క్షయ రోగులకు బీసీజీ టీకాలు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.