Share News

Bondi Beach shooting : ఆస్ట్రేలియా బాండి బీచ్ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:12 PM

ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. గన్ తో సైకోలుగా మారుతున్న దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఆస్ట్రేలియాలోని బాండి బీచ్ వద్ద ఇద్దరు అఘంతకులు కాల్పులకు తెగబడ్డారు.

Bondi Beach shooting : ఆస్ట్రేలియా బాండి బీచ్ వద్ద కాల్పులు.. 10 మంది మృతి
shooting at bondi beach in australia

ఆస్ట్రేలియా(Australia) లోని సిడ్నీ (Sydney) నగరంలో ఉన్న ప్రఖ్యాత బాండి బీచ్ (Bondi Beach) వద్ద కాల్పులు (Gun Shooting) ఘటన జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు అఘంతకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాల్పుల ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు న్యూ సౌత్ వెల్స్ (NSW) పోలీసులు సోషల్ మాధ్యమంలో ప్రకటించారు.


బాండి బీచ్ లో హనుక్కా ఉత్సవం సందర్భంగా ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని.. ప్రస్తుతం 10 మంది మృతి చెందినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్ తో పాటు పెద్ద ఎత్తున అంబులెన్స్, మెడికల్ సిబ్బంది మోహరించారు. దాడికి పాల్పడిన దుండగుల నుంచి మరింత సమాచారం రాబడుతున్నామని పోలీసులు తెలిపారు.


ఇవీ చదవండి:

అమెరికా యూనివర్సిటీలో కాల్పుల ఘటన.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

Updated Date - Dec 14 , 2025 | 04:33 PM