Share News

Congo mine accident: ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:36 AM

కాంగో రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలంలోనే సైనిక సిబ్బంది నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయని, ఆ శబ్దాలు గనిలో పనిచేస్తున్న కార్మికులలో గందరగోళాన్ని సృష్టించాయని తెలుస్తోంది

Congo mine accident: ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..
Congo mine accident

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో మైనింగ్ సైట్‌లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు (Congo bridge collapse).


మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్టు సమాచారం. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారని తెలుస్తోంది. కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్‌ జీవనాధారం. కనీసం 15-20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరిన్ని లక్షల మంది ఈ గనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు (Congo mine accident).


ఘటనా స్థలంలోనే సైనిక సిబ్బంది నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయని, ఆ శబ్దాలు గనిలో పనిచేస్తున్న కార్మికులలో గందరగోళాన్ని సృష్టించాయని తెలుస్తోంది (32 killed Congo mine). భారీ సంఖ్యలో కార్మికులు పరిగెత్తడంతో ఆ బరువును వంతెన భరించలేకపోయింది. ఆ బ్రిడ్జ్ విరిగిపోవడంతో కార్మికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ సంవత్సరం కాంగోలో జరిగిన అత్యంత ప్రాణాంతకమైన మైనింగ్ ప్రమాదాలలో ఇది ఒకటిగా పరిగణిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..

మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..

Updated Date - Nov 17 , 2025 | 12:28 PM