Share News

Ajit Doval Meets Russian Deputy PM: రష్యా ఉప ప్రధానితో డొభాల్‌ భేటీ

ABN , Publish Date - Aug 10 , 2025 | 02:53 AM

రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఆ దేశ అధినాయకత్వంతో

Ajit Doval Meets Russian Deputy PM: రష్యా ఉప ప్రధానితో డొభాల్‌ భేటీ

మాస్కో, ఆగస్టు 9: రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఆ దేశ అధినాయకత్వంతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా రష్యా డిప్యూటీ ప్రధాని డెనిస్‌ మంటురోవ్‌తో సమావేశమయ్యారు. మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సైనిక-సాంకేతిక అంశాల్లో సహకారం, వ్యూహాత్మక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. పౌర విమానాల తయారీ, ఖనిజాలు, రసాయన పరిశ్రమలపై చర్చించినట్లు భారత్‌లోని రష్యా ఎంబసీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అంతకు ముందు డొభాల్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్‌లో పర్యటించాలన్న ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించారని డొభాల్‌ తెలిపారు.

Updated Date - Aug 10 , 2025 | 02:53 AM