Afghanistan Earthquake 2025: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం!
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:58 AM
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. నష్టం భారీగా ఉండొచ్చని USGS అంచనా వేస్తోంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన..
ఆఫ్ఘనిస్తాన్, నవంబర్ 3: ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ తెల్లవారుజామున(సోమవారం) మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. 23 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున మజార్-ఇ-షరీఫ్ నగరం, ఖుల్మ్ పట్టణానికి సమీపంలో భూకంపం సంభవించిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని అయిన మజార్-ఇ-షరీఫ్.. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా వేస్తోంది.
అంతేకాదు, దేశంలోని అనేక ప్రావిన్సులలో రాత్రి 1 గంటలకు (ఆదివారం మధ్యాహ్నం 3:30 ET)కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్టు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు