Share News

Women Tortured Live: యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:59 PM

ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డెన్‌కు తీసుకెళ్లిపోయాడు. తర్వాత వారిని ఓ చోట బంధించి చిత్ర హింసలకు గురి చేయటం మొదలెట్టాడు. దీన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.

Women Tortured Live: యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..
Women Tortured Live

ఇంటర్నెట్ డెస్క్: ఓ డ్రగ్ డీలింగ్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. ముగ్గురు యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో వారిని చిత్ర హింసలకు గురి చేసి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన అర్జెంటీనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్యూనోస్ ఎరెస్ ప్రావిన్స్‌కు చెందిన మొరేనా వర్డీ, బ్రెండా డెల్ క్యాస్టిలో, మరో యువతి కుటుంబసభ్యులకు తెలియకుండా పడువు వృత్తి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అమ్మకాల్లో కూడా భాగం అయ్యారు.


కొన్నిరోజుల క్రితం ఆ ముగ్గురు తెలివి తక్కువ పని చేశారు. ఏ డ్రగ్ డీలింగ్ గ్యాంగ్‌లో అయితే పని చేస్తున్నారో ఆ గ్యాంగ్ నుంచి వీరు కొంత మొత్తం డ్రగ్స్ దొంగిలించారు. ఈ విషయం ఆ గ్యాంగ్ లీడర్‌కు తెలిసింది. అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇకపై తన గ్యాంగ్‌లో పని చేసే వారు ఎవ్వరూ డ్రగ్స్ దొంగలించకుండా ఉండటానికి ఓ క్రూరమైన నిర్ణయానికి వచ్చాడు. ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డెన్‌కు తీసుకెళ్లిపోయాడు. తర్వాత వారిని ఓ చోట బంధించి చిత్ర హింసలకు గురి చేయటం మొదలెట్టాడు. దీన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. వేళ్లు కత్తిరించాడు.. గోళ్లు పీకాడు.. విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు.


మంగళవారం వారి శవాలు కుటుంబసభ్యులకు చిక్కాయి. బుధవారం కుటుంబసభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు యువతుల దారుణ హత్యతో బ్యూనోస్ ఎరెస్ ప్రావిన్స్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జనం పెద్దఎత్తున నిరసనలకు దిగారు. బ్యూనోస్ ఎరెస్ వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గుర్నీ డ్రగ్ డీలింగ్ గ్యాంగ్ హింసించి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఓ నిందితుడ్ని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అతడి వద్ద నుంచి చిత్ర హింసలకు సంబంధించిన ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

జెయింట్ వీల్ ప్రమాదం.. చావు కేకలతో ఒక్కసారిగా అలజడి..

ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా

Updated Date - Sep 28 , 2025 | 06:02 PM