Delta plane collision: రెండు డెల్టా విమానాలు ఢీ.. ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన..
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:58 AM
న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఒక విమానం రెక్కకు నష్టం జరిగిందని సమాచారం (Delta plane collision).
ల్యాండింగ్ చేసిన తర్వాత విమానం గేట్ వైపు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో మరో డెల్టా విమానం వెనుకనుంచి ఆ విమానానికి ఢీ కొట్టినట్లు తెలుస్తోంది (New York airport accident). ఈ ప్రమాదం తర్వాత ఒక విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..