Share News

Skin Care: చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:56 PM

చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Skin Care: చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Winter Skin Care Tips

1.సాధారణంగా చలికాలం(winter) ఎంతో అహ్లాదంగా ఉంటుంది.. మనసుకు ఎంతో హాయినిస్తుంది. కాకపోతే ఈ సీజన్‌లో చర్మసమస్యలు (Skin problems) తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. గాలిలో తేమ(Moisture) తగ్గడం వల్ల చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

2. చలికాలంలో ఎక్కువగా పెదవుల (Lips), పాదాలు(Feet), చేతులు(Hands) పొడిబారడం (Dryness)తో దురదతో తెగ చిరాకు తెప్పిస్తుంది. అలాంటపుడు లిప్ బాంబ్ (Lip balm) లేదా నెయ్యి(Ghee), మీగడ (Cream) రాస్తు ఊంటే ఉపశమనం కలుగుతుంది. చాలా మంది పెదవులను నాలుకతో తడుపుతుంటా.. అలా చేయడం వల్ల వెంటనే పొడిబారుతుంది. కారణం లాలాజలం వల్ల పెదవులు త్వరగా పగులుతాయి. అందుకే లిప్ బాంబ్ లేదా వ్యాజిలిన్ (Vaseline)వాడితే మంచిది.

3. శీతాకాలం(Winter)లో చర్మాని(Skin)కి తేమ అందించడం ఎంతో ముఖ్యంగా. స్నానం చేసిన మూడు నిమిషాలలోపే మాయిశ్చరైజర్ (Moisturization) లేదా బాడీ లోషన్ (Body lotion)చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ కొంతసేపటి వరకు అలాగే ఉంటుంది. మాయిశ్చరైజర్‌కి నీటి శాతం ఎక్కువగా ఉండే లోషన్ల కన్నా, నూనె శాతం ఎక్కువగా ఉండే క్రీములు లేదా పెల్రోలియం జెల్లీ (Petroleum jelly) వంటి అయింట్‌మెంట్స్ మంచిది.


4. స్నానం(Bath) చేసే సమయంలో మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో చేయడం మంచిది. వేడి నీళ్లు(Hot water) చర్మంపై ఉండే నూనెలను తొలగించి మరింత పొడిబారేలా చేస్తుంది.. దాంతో దురదలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్నానానికి చాలా వరకు కెమికల్స్ తక్కువగా ఉండే మైల్డ్ సోప్స్ (Mild soaps)లేదా బాడీలోష్ వాడటం మంచింది

5. వింటర్ సీజన్‌లో చాలా మంది తక్కువగా మంచినీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు.. సాధ్యమైనంత వరకు నీటిని తీసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మాన్ని లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

6. చలికాలంలో ఆహార పదార్ధా(Food items)ల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒమేగా-3 (Omega-3)ఫ్యాటి యాసిడ్స్ అంటే బాదం, వాల్ నట్స్, చేపలు వంటి ఆహార పదార్థాలు చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


7. రాత్రి పడుకునే ముందు రెగ్యూలర్ గా పాదాలకు వాసెలిన్ లేదా కొబ్బరినూనె (Coconut oil) రాసుకుంటే పగుళ్లు రాకుండా ఉంటాయి. ఎండ తక్కువగా ఉన్నా సరే బయటకు వెళ్లేటపుడు సన్ స్క్రీన్ (Sunscreen) రాసుకోవడం మంచిది.

8. వంటింట్లో దొరికే సహజసిద్దమైన మాయిశ్చరైజర్లతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. పచ్చి పాలలో కొంచెం దూదిని ముంచి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మీగడను పగుళ్లు ఉన్న చోట మాయిశ్చరైజర్ చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

9. వారానికి కనీసం రెండు సార్లు స్నానానికి ముందు నువ్వుల నూనే కానీ ఆలీవ్ నూనెతో కాని ఒళ్లంతా మాయిశ్చరైజ్ చేసుకోండి. నూనె చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి మంచి పోషణనిస్తుంది. మసాజ్ చేసిన 15-20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే ఎంతో గ్లోగా కనిపిస్తారు. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చలికాలంలో చర్మసమస్యలు దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

(NOTE: పై సమాచారంఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:


జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 19 , 2025 | 12:56 PM