Share News

Health Tips: ఈ అలవాట్లు మీ రక్తపోటును పెంచుతాయి.. బీ కేర్ ఫుల్..

ABN , Publish Date - May 16 , 2025 | 10:25 AM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.అయితే, ఈ అలవాట్లు రక్తపోటుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips: ఈ అలవాట్లు మీ రక్తపోటును పెంచుతాయి.. బీ కేర్ ఫుల్..
Blood Pressure

అధిక రక్తపోటును 'సైలెంట్ కిల్లర్' అని అంటారు. ఎందుకంటే దీని ప్రారంభ లక్షణాలను సాధారణంగా వ్యక్తి గుర్తించలేడు. దీని లక్షణాలు క్రమంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన గుండె, మూత్రపిండాలు, మెదడు, ఇతర అవయవాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి వంటి ప్రాణాంతక సమస్యలకు ప్రధాన కారణం కావచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి, ధూమపానం రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. చాలామంది తెలిసి తెలియకుండానే తమ దినచర్యలో కొన్ని తప్పులు చేస్తున్నారని, దీనివల్ల అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఉప్పు ఎక్కువగా తీసుకోవడం

అధిక ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి, వీటికి బదులుగా మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోండి. అలాగే ఉప్పును సమతుల్య పరిమాణంలో తీసుకోవడం మంచిది.

ఎక్కువసేపు కూర్చోవడం

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ఎక్కువ సేపు అలానే కూర్చోకుండా శారీరానికి కాస్త పని చెప్పండి.

తగినంత నిద్ర లేకపోవడం

మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి. కాబట్టి, 7-8 గంటలు నిద్ర ఉండేలా టైం ప్లాన్ చేసుకోండి.

టీ లేదా కాఫీ

తరచుగా కొంతమంది టీ లేదా కాఫీని అధికంగా తీసుకుంటారు. నిజానికి, వాటిలో ఉండే కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు వస్తుంది. కాబట్టి టీ లేదా కాఫీ చాలా పరిమిత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.


Also Read:

Viral Video: ఇలాంటి స్వాగతాన్ని మీరెప్పుడూ చూసుండరు..

WhatsApp Tricks: అద్దిరిపోయే వాట్సాప్ ట్రిక్.. మెసేజ్ ఎవరిదో ఫోన్ చూడకుండానే చెప్పొచ్చు.

Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

Updated Date - May 16 , 2025 | 10:25 AM