Foods Should Never Reheat: మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు ఇవే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:26 PM
చాలా మంది తరచుగా కొన్ని ఆహారాలను వేడి చేసి తింటారు. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటే విషపూరితం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లు రావడంతో చాలా మంది మిగిలిపోయిన ఆహారాలను అందులో పెట్టేస్తుంటారు. తినాలని అనిపించినప్పుడు మళ్లీ ఆ ఆహారాన్ని వేడి చేసి తింటారు. కానీ, కొన్ని ఆహార పదార్ధాలను ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి విషపూరితంగా మారతాయని చెబుతున్నారు. అయితే, ఏ ఆహారాలు మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
సీఫుడ్
మీరు సీఫుడ్స్‌ను తరచుగా వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వేయించిన ఆహారాలు
వేయించిన ఆహార పదార్ధాలను మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నూనెలో చేసిన వాటిని మళ్లీ వేడి చేస్తే అనేక రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి. ఇది ప్రధానంగా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
ఆకుకూరలు
ఆకుకూరలను మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే వీటిని మళ్లీ వేడి చేస్తే వాటిలోని ఖనిజాలు కోల్పోతాయి. ఎలాంటి పోషక ప్రయోజనాలు ఉండవు.
గుడ్డు
ఉడికించిన గుడ్లను మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుడ్లను తయారు చేసి వెంటనే తినడం మంచిది.
బంగాళాదుంపలు
వేడిచేసిన బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇతర సమస్యలు వస్తాయి.
కాఫీ, టీ
మీరు కోల్డ్ కాఫీని మళ్లీ వేడి చేసి తాగడం మంచిది కాదు. దీనివల్ల కాఫీ నాణ్యత, రుచి తగ్గుతుంది. కాఫీ లాగే, టీని మళ్లీ వేడి చేస్తే దాని ప్రయోజనాలను కోల్పోతుంది. అంతేకాదు, ఇది టీలో టానిన్ సాంద్రతను కూడా పెంచుతుంది.
అన్నం
చాలా మంది అన్నంను మళ్లీ వేడి చేసి తింటారు. అయితే, ఇలా వేడి చేస్తే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ వేడి చేసి తినకూడదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: మాంసం త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..