Tips to Cook Meat Quickly: మాంసం త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..
ABN , Publish Date - Feb 15 , 2025 | 02:59 PM
మటన్ లాంటి మాంసాన్ని ఉడికించడానికి చాలా టైం పడుతుంది. అయితే, మాంసం త్వరగా ఉడికించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tips to Cook Meat Quickly: మటన్ లాంటి మాంసాన్ని ఉడికించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ఇలా ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల గ్యాస్ ఖర్చవుతుంది. అయితే, ఎక్కువ సమయం తీసుకోకుండా మాంసాన్ని త్వరగా ఉడికించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న ముక్కలుగా కోయండి..
కూర కోసం మాంసాన్ని చిన్న ముక్కలుగా కోయండి. మాంసాన్ని ఇలా చిన్న ముక్కలుగా కోసినప్పుడు అది ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోదు. త్వరగా ఉడుకుతుంది. ఇలా చేయడం వల్ల కూర త్వరగా తయారు అవుతుంది.
మసాలా దినుసులను కలపండి..
మాంసాన్ని వండడానికి ముందు మటన్‌పై నిమ్మకాయ రాసం పిండి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత కరివేపాకు వేస్తే, మాంసం వేగంగా ఉడుకుతుంది. ఇది మాంసాన్ని చాలా మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. మాంసానికి మంచి రుచిని కూడా ఇస్తుంది.
ప్రెజర్ కుక్కర్‌లో
ప్రెజర్ కుక్కర్‌లో వేసిన కూడా మాంసం త్వరగా ఉడికిపోతుంది. మటన్‌లో మసాలా దినుసులను వేసి ప్రెజర్ కుక్కర్‌లో పెడితే కూర త్వరగా రెడీ అవుతుంది. ఎక్కువ సమయం తీసుకోదు.
బొప్పాయి గుజ్జు
బొప్పాయి గుజ్జు మాంసాన్ని మృదువుగా చేయడానికి, త్వరగా ఉడికించడానికి, కూరకు రుచిని జోడించడానికి ఉపయోగించే ఒక పురాతన పద్ధతి. బొప్పాయి గుజ్జును మాంసంలో కలిపి కాసేపు అలాగే ఉంచి తర్వాత ఉడికించడం వల్ల మాంసం మృదువుగా ఉంటుంది. మాంసం సరిగ్గా ఉడకడానికి, దాని రుచిని పెంచడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం అమలు..