Resetting body after Festivities: పండగల్లో ఫుల్లుగా తినేశారా.. ఇలా చేస్తే బాడీ సెట్
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:57 PM
పండుగ తరువాత బరువు పెరుగుతామనే భయంలో ఉన్నవారికి నిపుణులు కొన్ని కసరత్తులు సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే బరువు నియంత్రణలో ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పండగకు వారం ముందుగానే ఎంజయ్ మూడ్‌లోకి వచ్చేసే జనాలు కోకొల్లలు. అప్పటి వరకూ ఫిట్‌నెస్, ఆహార నియమాలు అంటూ ఉండేవారు కూడా అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఫుల్లుగా తినేస్తారు. పండగ వెళ్లాక, జోష్ పూర్తిగా తగ్గాక గానీ చేసిన తప్పు అర్థం కాదు. ఆ తరువాత బరువు పెరిగొచ్చని భయపడిపోతుంటారు. ఇలాంటి వారు మళ్లీ ఫిట్‌గా అయ్యేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.
పండగ మరుసటి రోజు నుంచే మీళ్లీ కసరత్తులు మొదలెట్టాలి. స్వల్ప స్థాయిలో జాగింగ్ మొదలు, కార్డియో వంటివి 20 నుంచి 30 నిమిషాల పాటు చేస్తే ఒంట్లో విషతుల్యాలన్నీ తొలగిపోతాయి. జీవక్రియలు వేగవంతమవుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై ఉత్సాహం పెరుగుతుంది.
Read More: కిడ్నీల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్.. ఈ సంకేతాలపై నిర్లక్ష్యం వహిస్తే డేంజర్
స్విమ్మింగ్ కూడా మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కండరాలు సాగి రిలాక్స్ అవుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా మారుతాయి.
పండగ కారణంగా వచ్చిన బద్ధకం.. యోగా, పిలాటేస్ వంటివి చేస్తే తొలగిపోతుంది. శరీరం, మనసు మళ్లీ ఉత్సాహంగా మారతాయి. యోగాతో జీర్ణక్రియ మెరుగవుతుంది. మైండ్‌ఫుల్ బ్రీతింగ్ టెక్ని్క్స్ కూడా శరీరంలో శక్తిని సమతులీకరిస్తాయి. పిలాటేస్‌తో శరీరంలోని కోర్ భాగం కూడా బలోపేతం అవుతుంది. ఫ్లెక్సిబులిటీ కూడా పెరుగుతుంది.
కొత్త డైట్.. వరుసగా మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పళ్లు మాత్రమే తింటే..
కండరాలను, ఎముకలను మళ్లీ రీసెట్ చేయడానికి బాడీ వెయిట్ ఎక్సర్‌సైజులు కూడా కీలకం. స్క్వాట్స్, పుష్ అప్స్, పుల్ అప్స్, ప్లాంక్స్ వంటివన్నీ బాడీని మళ్లీ కండీషన్‌లోకి తెస్తాయి.
ఇక పోషకాహారం కూడా బాడీని మళ్లీ పాత కండీషన్‌కి తెచ్చేందుకు అవసరం. సమతులాహారంతో పాటు తగినంత నీరు తాగితే ఒంట్లోని విషతుల్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ టిప్స్‌ను యథాతథంగా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Read More: కొబ్బరి నూనెకు ఈ ఐదు కలిపి జుట్టుకు పట్టిస్తే బట్టతల నుంచి ఉపశమనం