Coconut Oil Bald Spots: కొబ్బరి నూనెకు ఈ ఐదు కలిపి జుట్టుకు పట్టిస్తే బట్టతల నుంచి ఉపశమనం
ABN , Publish Date - Mar 16 , 2025 | 08:03 PM
జుట్టుకు ఎంతో మేలు చేసే కొబ్బరి నూనెకు మరికొన్ని జత చేసి జుట్టుకు పట్టిస్తే జుట్టు పలచబడటం నుంచి విముక్తి లభిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు పలచబడటం లేదా అక్కడక్కడా ఊడిపోవడం వంటివి కాన్ఫిడెన్స్‌ను తగ్గిస్తాయి. కానీ ఈ సమస్యకు ప్రకృతి అనేక సహజసిద్ధమైన పరిష్కారాలు అందించింది. వీటిలో మొట్టమొదటిది కొబ్బరి నూనె. అయితే, కొబ్బరి నూనెకు మరి కొన్నింటిని జత చేస్తే దాని ప్రభావం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తనిని పెంపొందించే సల్ఫర్ ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి నెత్తిపై జుట్టు ఊడిపోతున్న చోట మర్దన చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది.
ఆముదంతో కూడా జుట్టుకు మేలు జరుగుతుంది. ఇందులోని రిసినోలిక్ యాసిడ్, ఇతర యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు నెత్తిపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇక దీన్ని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
Read More: కుక్క కరిచినప్పుడు టీకా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆలోవీరా ఎంతటి మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆలోవీరా జెల్‌ను కొబ్బరి నూనెకు జత చేసి నెత్తికి పట్టిస్తే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. ఆలోవీరాలోని విటమిన్స్, మినరల్స్ జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
మెంతుల్లో ప్రొటీన్లు, ఐరన్, నికోటినిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇది డాండ్రఫ్‌ను కూడా నిరోధిస్తుంది. జుట్టును కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది. కాబట్టి మెంతుల పేస్టును కొబ్బరి నూనెకు జత చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది.
Read More: మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్.. అధ్యయనంలో వెల్లడి!
కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్స్, ప్రొటీన్లు, బీటా కెరోటీన్ జట్టు పలచబడటాన్ని నిరోధిస్తాయి. మళ్లీ జుట్టు మొలిచేలా చేస్తాయి. ఈ పేస్టును కొబ్బరి నూనెకు జత చేసి నెత్తికి పట్టిస్తే ఫలితాలు రెట్టింపవుతాయి. జట్టు పలచబడటం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనెలో సహజంగానే జుట్టును కాపాడే అనేక గుణాలు ఉంటాయి. వీటిని ఈ ఐదింటినీ జోడిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బట్టతల నుంచి కొంతైనా ఉపశమనం లభించేందుకు ఈ టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు.