Remedies For Yellow Teeth: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:25 PM
Remedies For Yellow Teeth: పసుపు దంతాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఇంటి చిట్కాలతో పసుపు దంతాలను తెల్లగా మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు.

మన శరీరంలో అన్ని అవయాలు ముఖ్యమే. దేని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అలాగే దంతాలు కూడా వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు ముందుగా కనిపించేవి దంతాలే. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే సరైన ఆహారాన్ని తీసుకోగలుతాం. దంతాల సహాయంలో ఆహారాన్ని నమిలి తినడం వల్ల జీర్ణక్రయి సక్రమంగా ఉంటుంది. కాబట్టి దంతాలను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దంతాలు మెరుస్తూ ఉంటేనే బావుంటుంది. కానీ కొందరి దంతాలపై పసుపు పొర ఏర్పడుతుంది. ఇది వ్యక్తిత్వంపై ప్రభావం పడటంతో పాటు ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దంతాలు పచ్చగా ఉంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇంటి చిట్కాలతో దంతాలపై పచ్చటి పొరను తొలగించేలా చేసి మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉప్పు, ఆవ నూనే
ఉప్పు, ఆవ నూసే సాయంతో దంతాలపై పసుపు పొరను తొలగించేలా చేసుకోవచ్చు. ఆఫ్ టీస్పూన్ ఉప్పును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ దంతాలపై బాగా రుద్దాలి. ఇలా ప్రతీరోజు చూస్తే పచ్చ దంతాలు తెల్లగా మెరుస్తాయి.
కొబ్బరి నూనె, నువ్వుల నూనెతో
దంతాలను శుభ్రం చేసుకునేందుకు నూనె కూడా సహాయపడుతుంది. ఇది పురాతమైన ఆయుర్వేద పద్ధతి. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను నోటిలో 10 నుంచి 15 నిమిషాల ఉంచి తర్వాత ఉమ్మివేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకపోయిన మురికి, మరకలు తొలగిపోతాయి.
బేకింగ్ సోడాతో
బేకింగ్ సోడాతో కూడా పచ్చ పళ్లను మెరిసేలా చేసుకోవచ్చు. బేకింగ్ సోడాను టూత్ పేస్ట్ లేదా నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీంతో బ్రెష్ చేయడం ద్వారా దంతాలపై ఉండే పసుపు పొర తొలగిపోతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించి దంతాలపై పసుపు పొరను తొలగించుకోవచ్చు. అయితే దీన్ని చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దంతాలపై యాసిడ్‌ను పదే పదే వాడితే దంతాలు సున్నితత్వం వచ్చే అవకాశం ఉంటుంది.
పండ్ల తొక్కలతో
కొన్ని పండ్ల తొక్కలతో కూడా దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ, అరటిపండు, నారింజ తొక్కలతో దంతాలపై ఉన్న పసుపు పొరను తొలగించుకోవచ్చు. అయితే పండ్ల తొక్కలతో దంతాలు శుభ్రం చేసుకోవడానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ పరిమితంగా వీటిని ఉపయోగించుకుని దంతాలను మెరిసేలా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
Read Latest AP News And Telugu News