Share News

Paracetamol Use: పారాసెటమాల్ ఎక్కువగా వేసుకుంటున్నారా?

ABN , Publish Date - Aug 28 , 2025 | 03:33 PM

జ్వరం వచ్చిన ప్రతిసారి అదే పనిగా పారాసెటమాల్ వేసుకుంటున్నారా? అయితే, ఈ అలవాటు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

 Paracetamol Use: పారాసెటమాల్ ఎక్కువగా వేసుకుంటున్నారా?
Paracetamol

ఇంటర్నెట్ డెస్క్‌: మనకు జ్వరం లేదా ఏదైన నొప్పి వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఇబుప్రోఫెన్, పారాసెటమాల్ తీసుకుంటాము. ఈ రెండు మందులు వైద్యులను సంప్రదించకుండానే అందరూ తీసుకుంటారు. కొంతమంది ప్రతి రెండు మూడు రోజులకు ఈ మందులలో ఒకదాన్ని తీసుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఎందుకంటే ఈ రెండు మందులు నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.


ఈ మందులు యాంటీబయాటిక్ నిరోధకతను పెంచుతాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. యాంటీబయాటిక్ నిరోధకత" (Antibiotic Resistance) అంటే, మన శరీరానికి హానికరమైన బ్యాక్టీరియా యాంటీబయాటిక్ మందులకు పని చేయకుండా మొండిగా మారుతుంది. అంటే, మీరు ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కి మందులు (యాంటీబయాటిక్స్) తీసుకున్నప్పుడు అవి పనిచేయకపోవచ్చు. కారణం, ఆ బ్యాక్టీరియా ఆ మందులకు ఇప్పటికే అలవాటుపడిపోయి, అవి దానిపై ప్రభావం చూపలేకపోవడం. దీని కారణంగా మీకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దానిని చంపడానికి మీరు తీసుకునే యాంటీబయాటిక్ ఔషధం ప్రభావవంతంగా ఉండదు.


తీవ్రమైన ప్రభావాలు

పారాసెటమాల్ వంటి మందులను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం లేదా మూత్రపిండాలు దెబ్బతింటాయి. మీరు సూచించిన దానికంటే ఎక్కువ టాబ్లెట్లను తీసుకుంటే, అది శరీరానికి హానికరం అని పరిశోధనలో తేలింది. నొప్పి నివారణ మందులను అధికంగా తీసుకోవడం మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన హెచ్చరిస్తుంది. అందువల్ల, వైద్యుల సలహా లేకుండా ఏ ఔషధాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో గణేశుడు.. నిర్వాహకులకు షాక్ ఇచ్చిన పోలీసులు

రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

For More Latest News

Updated Date - Aug 28 , 2025 | 03:41 PM