Share News

Gut brain axis: నోటిలోని బ్యాక్టీరియా వల్ల పార్కిన్సన్ వస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే..

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:22 PM

నోటిలోని బ్యాక్టీరియా పార్కిన్సన్ వ్యాధికి కారణమవుతోందని ఓ కొత్త అధ్యయనం సంచలన విషయాన్ని వెల్లడించింది. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ సరికొత్త విషయాన్ని వెల్లడించారు.

Gut brain axis: నోటిలోని బ్యాక్టీరియా వల్ల పార్కిన్సన్ వస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే..
oral microbiome

నోటిలోని బ్యాక్టీరియా పార్కిన్సన్ వ్యాధికి కారణమవుతోందని ఓ కొత్త అధ్యయనం సంచలన విషయాన్ని వెల్లడించింది. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. నోటిలోని బ్యాక్టీరియా ప్రేగులలో స్థిరపడి, మెదడులోని న్యూరాన్‌లను ప్రభావితం చేస్తుందని, పార్కిన్సన్స్ వ్యాధిని ప్రేరేపించగలదని తాజా అధ్యయనంలో తేలింది (oral bacteria Parkinson’s risk).


పార్కిన్సన్స్ ఉన్న వ్యక్తుల గట్ మైక్రోబయోటా ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుందని మునుపటి అధ్యయనాలు కూడా కొన్ని సూచించాయి. పార్కిన్సన్స్ రోగుల గట్ మైక్రోబయోమ్‌లో దంత క్షయానికి కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ (Streptococcus mutans) ఎక్కువగా ఉన్నట్టు కొన్ని పరిశోధనలు తెలిపాయి. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ ఎంజైమ్ అయిన యురోకనేట్ రిడక్టేజ్.. ఇమిడాజోల్ ప్రొపియోనేట్‌ని (ImP) ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తం ద్వారా మెదడును చేరుకుని, డోపమినెర్జిక్ న్యూరాన్‌ల (dopaminergic neurons) నష్టానికి దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తేలింది.


నోటి నుంచి పేగులలోకి చేరిన బ్యాక్టీరియా (oral microbiome) ఉత్పత్తి చేసే జీవక్రియలు పార్కిన్సన్ వ్యాధిని ట్రిగ్గర్ చేస్తున్నాయట. గట్‌లోకి నోటి ద్వారా చేరిన బ్యాక్టీరియా మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో, పార్కిన్సన్స్ వ్యాధి అభివృద్ధికి ఎలా దోహదపడుతుందనే అవగాహనను తమ అధ్యయనం అందిస్తుందని ప్రొఫెసర్ అరా కో అన్నారు (Parkinson’s study). తమ అధ్యయనం పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు కొత్త దిశను సూచిస్తుందని, ఈ వ్యాధి చికిత్సలో గట్ మైక్రోబయోటాను లక్ష్యంగా చేసుకోవాలని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?

షాకింగ్ రిపోర్ట్.. పుట్టుకతోనే 41,000 మంది పిల్లలకు గుండె జబ్బులు

For More Health News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 12:22 PM