Onion on Feet Fact Check: పాదాలకు ఉల్లిపాయలు పెట్టుకుంటే శరీరం డిటాక్స్ అవుతుందా?
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:33 PM
పాదాలకు ఉల్లిపాయలు పెట్టుకుంటే శరీరం డిటాక్స్ అవుతుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అయితే, అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెటె డెస్క్: ఉల్లిపాయ వంటల్లో రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడం, క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, పాదాలకు ఉల్లిపాయలు పెట్టుకుంటే శరీరం డిటాక్స్ అవుతుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అయిన వీడియోలో ఓ ఇన్ ఫ్లూయెన్సర్ ఒక ఉల్లిపాయను సగానికి కట్ చేసి ఉల్లిపాయ ముక్కను పాదాల కింద పెట్టుకున్నాడు. అలా రాత్రంతా పాదాలకు ఉల్లిపాయలు పెట్టుకుని పడుకుంటే శరీరం డిటాక్స్ అవుతుందని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
హ్యాక్ పనిచేస్తుందా?
నేషనల్ ఆనియన్ అసోసియేషన్ ప్రకారం , కట్ చేసిన పచ్చి ఉల్లిపాయ గాలిలోని సూక్ష్మక్రిములు, టాక్సిన్స్ లేదా కాలుష్య కారకాలను గ్రహిస్తుందనే వాదనను నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉన్నప్పటికీ, వాటిని చర్మంపై ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు లభించవని తెలుస్తోంది.
Also Read:
కల్తీ లవంగాలతో కాలేయానికి ముప్పు.. వాటిని ఇలా గుర్తించండి?
ప్రసవం వల్ల తల్లి ఆయుష్షు తగ్గుతుందా?
For More Latest News