Natural Tips For Lungs: ఊపిరితిత్తులను సహజంగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు.!
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:04 PM
పెరిగిపోతున్న కాలుష్యం, స్మోకింగ్ వంటివి ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. కాబట్టి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే, వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులను సహజంగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన శరీరంలో ఊపిరితిత్తులు అనేవి అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ప్రస్తుత జీవనశైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పెరిగిపోతున్న కాలుష్యం, స్మోకింగ్ వంటివి ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. కాబట్టి, ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే, వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులను సహజంగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊపిరితిత్తులను ఇలా క్లీన్ చేయవచ్చు..
తులసి
తులసి ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-Inflammatory), యాంటీ బాక్టీరియల్ (anti-bacterial) లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. దీనిని తేనె, అల్లంతో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది.
అల్లం
అల్లం కూడా ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి శ్వాసనాళాల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. అల్లం.. పొటాషియం, మెగ్నీషియం, బీటా-కెరోటిన్, జింక్ వంటి అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. అల్లంలోని యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా అల్లం నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మంటను తగ్గించి, శ్లేష్మం తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు సహజంగా ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇది శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది, ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపును మీరు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఊపిరితిత్తులు సహాజంగా క్లీన్ అవుతాయని నిపుణులు అంటున్నారు.
(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవీ చదవండి:
కాఫీ విషయంలో డాక్టర్ సూచన.. నెట్టింట రేగుతున్న కలకలం
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ