Share News

Liver Health: లివర్ ఆరోగ్యానికి ఏ డ్రింక్స్ తీసుకోవాలి? హార్వర్డ్ డాక్టర్ సమాధనమిదే..!

ABN , Publish Date - Jun 29 , 2025 | 10:47 AM

Liver Detox Drinks: మన శరీరం సమర్థంగా పనిచేయడంలో హార్మోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకే, వీటి ఉత్పత్తిని నియంత్రించే కాలేయ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ ఏఏ డ్రింక్స్ తాగాలో సోషల్ మీడియా వేదికగా ఒక లిస్ట్ విడుదల చేశారు హార్వర్డ్ డాక్టర్ సౌరభ్ సేథి. అవేంటంటే..

Liver Health: లివర్ ఆరోగ్యానికి ఏ డ్రింక్స్ తీసుకోవాలి? హార్వర్డ్ డాక్టర్ సమాధనమిదే..!
Top Liver Detox Drinks

Best Drinks For Liver Health: మానవుని శరీరంలో అత్యంత శక్తివంతమైన, నిరంతరం పని చేసే అవయం 'లివర్'. ఇది రోజంతా మనం తీసుకునే ఆహారాన్ని శరీరం గ్రహించుకునేలా చేయడమే కాకుండా.. శరీరంలోకి వచ్చే విషపూరిత పదార్థాలను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఆధునిక జీవనశైలి, అపరిమితమైన అల్కహాల్ సేవనం, ప్రాసెస్డ్ ఫుడ్స్, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో లివర్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఇదే తరహా సమస్యలు పెరుగుతున్నందున హార్వర్డ్- స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల నెట్టింట్లో ఓ పోస్ట్ చేశారు. లివర్ ఆరోగ్యానికి సహకరించే ఓ10 డ్రింక్స్‌కు ర్యాంకింగ్ ఇస్తూ ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు. డాక్టర్ సేథి చెప్పిన విధంగా ఏ పానీయాలు కాలేయ ఆరోగ్యానికి మంచివో తెలుసుకుందాం.


కాలేయ ఆరోగ్యానికి టాప్-10 డ్రింక్స్

  • ఆకుపచ్చని స్మూతీలు: 5/10

  • తాజాగా పిండిన పండ్ల రసం: 4/10

  • బీట్‌రూట్ రసం : 7/10

  • తియ్యని కూరగాయల రసం: 8/10

  • నిమ్మకాయ నీరు: 6/10

  • తియ్యటి టీ: 2/10

  • బ్లాక్ కాఫీ: 9/10

  • దుకాణంలో కొనుగోలు చేసిన పండ్ల రసం: 1/10

  • నీరు: 10/10


అయితే, పైన ఇచ్చిన పానీయాల్లో బీట్ రూట్ జ్యూస్, బ్లాక్ కాఫీలు కాలేయానికి గొప్ప డీటాక్సిఫికేషన్ డ్రింక్సా అని డాక్టర్ సేథీ సూచిస్తున్నారు. వీటిని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండే లివర్ ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.


తీసుకోవాల్సి జాగ్రత్తలు..

  • ఆల్కహాల్ కు దారంగా ఉండాలి. ఇది లివర్ సెల్స్‌ను నశనం చేస్తూ సిరోసిస్, ఫ్యాటీ లివర్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది.

  • అధిక షుగర్, రిఫైన్‌డ్ కార్బ్స్ వల్ల లివర్‌పై వత్తిడి పెరుగుతుంది. నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)కు ఇదొక ప్రధాన కారణం.


Also Read:

మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారా? ఈ సమస్యలు తప్పవు.. సైంటిస్టుల సర్వేలో

పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?

For More Health News

Updated Date - Jun 29 , 2025 | 11:37 AM