Water Bottle: 20 రూపాయల వాటర్ బాటిల్.. మీ ఆరోగ్యానికి సురక్షితమేనా..
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:29 PM
వాటర్ బాటిల్ కేవలం 20 రూపాయలకే అని తాగుతున్నారా? అయితే, ఆ బాటిల్‌లోని వాటర్ తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా ? ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Water Bottle: మనం ప్రయాణం చేసేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ, కొన్నిసార్లు సమయం లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మనం వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మరచిపోతాం. అప్పుడు మన దాహం తీర్చుకోవడానికి షాప్‌లో దొరికే వాటర్ బాటిల్ తీసుకుంటాం. అది కూడా కేవలం 20 రూపాయలకేనని పెద్దగా ఆలోచించకుండా వాటిని కొని తాగేస్తాం. అయితే, ఆ బాటిల్‌లోని వాటర్ తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? 20 రూపాయల ఖరీదు చేసే లీటర్ బాటిల్‌ని చాలా మంది స్వచ్ఛమైన మినరల్ వాటర్ అనుకుని తాగుతారు.
మార్కెట్లో చాలా కంపెనీలు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని అమ్ముతాయి. ఈ బాటిళ్లను చల్లగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచి ఆపై అమ్ముతారు. ఇది ప్రయాణికుల దాహాన్ని తీరుస్తుంది. అయితే, ఈ నీరు మినరల్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ కావచ్చు. అయితే, దీన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మినరల్ వాటర్ లేదా కుళాయి నీటిని గుర్తించడానికి మీరు బాటిల్‌పై లేబుల్‌పై వ్రాసిన సమాచారానికి జాగ్రత్తగా గమనించండి. PWS (పబ్లిక్ వాటర్ సోర్స్) కోడ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దానిని PWS అని వ్రాస్తే, ఆ నీరు ప్రజా నీటి వనరు నుండి నింపబడిన కుళాయి నీరు. అంటే అది మినరల్ వాటర్ కాదు.! కొన్ని సంవత్సరాల క్రితం, ఒక అమెరికన్ కంపెనీ తాను అమ్మిన బాటిళ్లలో కుళాయి నీటిని అమ్మినట్లు అంగీకరించింది. దీని ఫలితంగా కంపెనీలను PWSగా లేబుల్ చేయాలనే చట్టం ప్రవేశపెట్టింది.
PWS లేకపోతే, ఆ నీరు మినరల్ వాటర్ లేదా స్ప్రింగ్ వాటర్ (సహజ వనరు నుండి వచ్చిన నీరు) కావచ్చు. ఈ సమాచారం బాటిల్‌పై ఉంటుంది. అలాగే, బాటిళ్లపై BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) గుర్తులను తనిఖీ చేయండి. ఈ గుర్తులు భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నీరు, ప్లాస్టిక్ బాటిల్ నాణ్యతను పరీక్షించారని నిర్ధారిస్తాయి. ఈ గుర్తులు లేకుండా బాటిళ్లను కొనకండి. ఎందుకంటే అవి నాణ్యతలేనివని అర్థం. ఈ సమాచారంతో మీరు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని ఎంచుకోవచ్చు.
Also Read:
మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..
రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..
For More Lifestyle News