Share News

Women and men Hight: మహిళల కంటే పురుషులే ఎత్తు ఎక్కువగా ఎందుకుంటారో తెలుసా..

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:36 AM

మహిళలు, పురుషుల మధ్య తేడా జన్యువులు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పురుషులు హైట్ పెరిగేందుకు టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని, అది బోన్స్ పెరుగుదలకు నియంత్రిస్తుందని చెబుతున్నారు.

Women and men Hight: మహిళల కంటే పురుషులే ఎత్తు ఎక్కువగా ఎందుకుంటారో తెలుసా..
Men and women hight

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే మగవారే శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎత్తు విషయంలోనూ ఆడవారి కంటే దాదాపుగా మగవారిదే పైచేయి ఉంటుంది. సినిమాల ప్రభావమో ఏమో గానీ సాధారణంగా చాలా మంది యువతులు సైతం ఎక్కువ ఎత్తున్న యువకులనే పెళ్లాడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మహిళల కంటే పురుషులే ఎందుకు ఎత్తు ఎక్కువగా పెరుగుతారనే దానికి అనేక కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.


మహిళలు, పురుషుల మధ్య తేడా జన్యువులు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పురుషులు హైట్ పెరిగేందుకు టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుందని, ఇది పురుషుల్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఎముకల పెరుగుదలకు దోహదపడుతుందని వెల్లడిస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని, అది బోన్స్ పెరుగుదలకు నియంత్రిస్తుందని పేర్కొన్నారు.


అయితే కొంతమంది మగవారు ఎత్తు తక్కువగానూ, మహిళలు హైట్ ఎక్కువగానూ కనిపిస్తుంటారు. కుటుంబ చరిత్ర, తల్లిదండ్రుల ఎత్తు, పోషణ వంటి అంశాలు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరైనా సరే ఎత్తు పెరిగినా లేదా తక్కువగా ఉన్నా అందుకు ప్రధానంగా జన్యువులే కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శరీరానికి సరైన పోషకాలు అందించగలిగినా హైట్ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. బోన్స్ పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి, క్యాల్షియం వంటివి అందించగలిగితే ఎత్తు పెరుగుతారని, మన ఎత్తు అనేది జీవితకాలంలో నెమ్మదిగా మారుతూ ఉంటుందని చెబుతున్నారు.


చిన్నపిల్లల్లో హైట్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని, వారికి 18 లేదా 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత క్రమంగా నెమ్మదిస్తుందని చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యానికి వచ్చే సరికే వయసు రీత్యా ఎముకలు కుంచించుకుపోతాయని, క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు బోన్స్‌కు సరిగ్గా అందవని పేర్కొన్నారు. కొన్నికొన్ని సందర్భాల్లో వారిలో ఎముకలు పెలుసుగా మారిపోయి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. అందుకే ప్రతిఒక్కరూ వ్యాయామం చేసి ఎముకలు గట్టిగా మారేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Jan 29 , 2025 | 07:36 AM