Heart Attack Risk: ఇలాంటి వాళ్లకు రాత్రి పూట గుండె పోటు రిస్క్ రెట్టింపు.. ఎందుకో వివరించిన డాక్టర్
ABN , Publish Date - Sep 12 , 2025 | 09:09 PM
బీపీ, షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారిలో గుండె పోటు ముప్పు రెట్టింపవుతుందని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. మందులు సమయానికి వేసుకోని వారిలో కూడా ఇదే తరహా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: రాత్రి పూట గుండె పోటు రిస్క్ పెరుగుతుందా? అంటే అవుననే అంటున్నారో డాక్టర్. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. డా. డిమిట్రీ యారనావ్ అనే కార్డియాలజిస్టు సోషల్ మీడియాలో ఈ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎటువంటి ట్రీట్‌మెంట్ తీసుకోని బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ ముప్పు రాత్రి వేళ రెండింతలు అవుతుందని వివరించారు. సమయానికి ఈ ఔషధాలు తీసుకోని వాళ్లల్లో కూడా రాత్రి వేళ ఈ ముప్పు పెరుగుతుందని తెలిపారు (night time heart attack risk).
డా. డిమిట్రీ తెలిపిన దాని ప్రకారం, హార్ట్ ఎటాక్ అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. గుండె పోటు రిస్క్ అత్యధికంగా తెల్లవారుజామున ఉంటుంది. ఈ సమయంలో ఒంట్లో కార్టిసాల్ హార్మోన్ పతాకస్థాయికి చేరుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరుగుతుంది. బీపీ రోగులకు ఇలాంటి పరిస్థితుల్లో ముప్పు మరింతగా పెరుగుతుంది. బీపీ మందులు సరైన సమయంలో తీసుకోకపోయినా, లేక మందులు వేసుకోవడం మర్చిపోయినా తెల్లవారుజామున హార్ట్ ఎటాక్ ముప్పు మరింత ఎక్కువగా అవుతుంది (blood pressure spikes at night). షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారిలో రక్తనాళాల్లో పేరుకున్న ప్లాక్స్ ఈ సమయంలో ప్రాణాంతకంగా మారుతాయి.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, బీపీ ఔషధాలను ఉదయం పూట కంటే రాత్రివేళ తీసుకుంటే బెనిఫిట్ మరింత ఎక్కువగా ఉంటుందట. స్పెయిన్‌లో సుమారు 19 వేల పేషెంట్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం, రాత్రివేళ బీపీ మందులు తీసుకునే వారిలో గుండె పోటు సంబంధిత మరణం ముప్పు ఏకంగా సగానికి తగ్గిందట. ఒకే ఔషధాన్ని వివిధ సమయాల్లో తీసుకుంటే వివిధ రకాల ప్రభావాలు కనిపిస్తున్నట్టు కూడా అధ్యయనకారులు గుర్తించారు. కాబట్టి, ఔషధాలు వేసుకునే విషయంలో ఎలాంటి అజాగ్రత్త కూడదని హెచ్చరించారు (nocturnal heart attack prevention).
ఇవి కూడా చదవండి:
హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించే ఈ 2 కీలక టెస్టుల గురించి తెలుసా..
కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..