Share News

Blood Pressure: కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:01 PM

బీపీ చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రెండు చేతులను పరీక్షించి బీపీని లెక్కించుకోవాలని అంటున్నారు. ఈ రెండు బీపీ రీడింగ్స్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Blood Pressure: కుడి, ఎడమ చేతుల బీపీ రీడింగ్స్‌లో వ్యత్యాసం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Difference in BP Readings of Both Arms

ఇంటర్నెట్ డెస్క్‌: బీపీలో మార్పులు అనేక అనారోగ్యాలకు సంకేతం. కాబట్టి బీపీ చెక్ చేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా బీపీ రీడింగ్స్‌లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. మరి కుడి, ఎడమ చేతి బీపీ రీడింగ్స్‌లో తేడా ఉంటే ఏం చేయాలి అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు.

రెండు చేతుల్లో బీపీని చెక్ చేసుకోవాలని ఇటీవల కాలంలో వైద్యులు సూచిస్తున్నారు. ఈ రెండు రీడింగ్స్ మధ్య వ్యత్యాసాలు అనారోగ్యాలకు సంకేతమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ తెలుసుకునేందుకు కేవలం ఒక చేతినే పరీక్షిస్తే 12 శాతం కేసుల్లో తప్పులు దొర్లే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది.

రెండు చేతుల మధ్య బీపీ రీడింగ్స్‌లో 5 ఎమ్‌ఎమ్ తేడాను సాధారణమైనదిగా పరిగణించాలని అధ్యయనాలు చెబుతున్నాయి. 5 నుంచి 10 ఎమ్ఎమ్‌ పాయింట్ల తేడా ఉంటే అనారోగ్యం ముప్పు స్వల్పంగా ఉన్నట్టు భావించాలట. ఇక ఈ వ్యత్యాసం 10 నుంచి 15 ఎమ్ఎమ్ మధ్య ఉంటే ఓ మోస్తరు రిస్క్ ఉన్నట్టు, 15 ఎమ్ఎమ్‌కు పైగానే ఉంటే అనారోగ్యం ముప్పు అధికంగా ఉన్నట్టు భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.


టైప్-2 డయాబెటిస్‌ పేషెంట్స్‌లో రెండు చేతుల బీపీ రీడింగ్స్ మధ్య తేడా 10 ఎమ్ఎమ్‌గా ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో బయటపడింది. హృద్రోగాలు ఉన్న వారిలో ఈ తేడా 15 ఎమ్ఎమ్‌కు పైనే ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. బీపీ చెక్ చేసుకునే విధానంలో చిన్న పొరపాటు జరిగినా రీడింగ్స్‌లో తప్పులు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు చేతులను టేబుల్ లాంటి వాటిపై పెట్టి బీపీని చెక్ చేయాలి. అలా కాకుండా చేయి వేలాడుతూ ఉన్నప్పుడు పరీక్షిస్తే సిస్టోలిక్ బీపీ సగటున 6.5 ఎమ్ఎమ్‌ వరకూ, డయాస్టోలిక్ బీపీ సగటున 4.4 ఎమ్ఎమ్ వరకూ పెరుగుతుందట. కాబట్టి బీపీ చెక్ చేసేటప్పుడు పేషెంట్స్‌ను కుర్చీలో కూర్చోమని చెప్పాలి. రోగులు తమ చేతులను ఎదురుగా ఉన్న టేబుల్‌‌పై పెట్టాక అప్పుడు బీపీ చెక్ చేయాలి. రెండు చేతుల్లో బీపీని చెక్ చేయాలి. ఈ రీడింగ్స్ మధ్య తేడా 10 ఎమ్ఎమ్‌కు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


ఇవి కూడా చదవండి:

రాత్రిళ్లు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ

Read Latest and Health News

Updated Date - Sep 04 , 2025 | 10:27 PM