Hand Dryers in Public Toilets: పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రయ్యర్స్ వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:16 PM
పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రయ్యర్స్ వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి బదులు పేపర్ టవల్స్ వాడితే మెరుగైన రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పబ్లిక్ వాష్‌రూమ్స్ వినియోగించుకున్నాక చాలా మంది అక్కడి హ్యాండ్ డ్రయ్యర్స్‌ను వాడుతుంటారు. పేపర్ టవల్స్ కంటే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయమని భావిస్తుంటారు. అయితే, ఈ ఆలోచన చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు (Hand Dryers in Public Toilets).
శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, పబ్లిక్ వాష్‌రూమ్‌లలోని హెయిర్ డ్రయ్యర్‌లు అక్కడి గాలినే మళ్లీ రీసైకిల్ చేసి అధికవేగంతో వదులుతుంటాయి. ఫలితంగా బాత్రూమ్ గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు, దుమ్ము, ఫంగస్ వంటివి చేతిపై పడతాయి. ఇలాంటి డ్రయ్యర్స్ సమీపంలోని గాల్లో సూక్ష్మక్రిముల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో కూడా ఇప్పటికే రుజువైంది (Health Risks).
పేపర్ టవల్స్ ఎక్కువగా వినియోగించే చోట్లతో పోలిస్తే డ్రయ్యర్స్ వద్ద గాల్లో 27 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది. కాబట్టి, పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో డ్రయ్యర్స్‌ను వాడే విషయంలో జాగ్రత్త వహించాలి. వీటికి బదులు పేపర్ టవల్స్ వాడితే చేతి మీద ఉన్న సూక్ష్మక్రిములు మరింత సమర్థవంతంగా తొలగిపోతాయి.
పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడిన సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 20 సెకెన్ల పాటు చేతులను కడుక్కుంటేనే సూక్ష్మక్రిములు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. ఆ తరువాత చేతులను బాగా ఆరబెట్టుకోవాలి. తడి చేతుల కారణంగా హానికారక సూక్ష్మ క్రిములు మరింత ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. చేతులను ఆరబెట్టుకునేందుకు వీలైనప్పుడల్లా పేపర్ టవల్స్‌నే వాడాలి. హ్యాండ్ డ్రయ్యర్స్ వాడాల్సి వస్తే ఆ తరువాత శానిటైజ్డ్ టిష్యూ పేపర్‌తో మరోసారి చేతులను శుభ్రపరుచుకోవాలి. ఇక ఆసుపత్రుల వంటి చోట్ల హ్యాండ్ డ్రయ్యర్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
భారతీయుల్లో ఎక్కువగా కనిపించే బానపొట్ట! కారణం ఇదేనా..
బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..