Share News

Glycerine Health Benefits: గ్లిజరిన్‌తో జుట్టుకు ఇన్ని ప్రయోజనాలా

ABN , Publish Date - Apr 17 , 2025 | 09:21 PM

గ్లిజరీన్‌తో జుట్టుకు అనేక ప్రయోజాలు కలుగుతాయి. జుట్టు బలోపేతం అవడమే కాకుండా నిగనిగలాడుతూ కొత్త అందం సంతరించుకుంటుంది. మరి గ్లిజరిన్‌తో కలిగే ఇతర ప్రధాన ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Glycerine Health Benefits: గ్లిజరిన్‌తో  జుట్టుకు ఇన్ని ప్రయోజనాలా
Glycerine For Hair

ఇంటర్నెట్ డెస్క్: గ్లిజరిన్‌తో జుట్టుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది తేమను పట్టి ఉంచుతుందని, ఫలితంగా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. జుట్టు జీవం లేనట్టుగా ఉండటం, డ్రై నెస్ వంటివన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, గ్లిజరీన్‌కు పరిసరాల నుంచి తేమను గ్రహించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి గ్లిజరిన్ రాసుకున్నప్పుడు జుట్టును తగినంత తేమ లభిస్తుంది. గ్లిజరీన్‌కు కాస్తంత తేనే జోడించి జుట్టుకు పట్టిస్తే నిగనిగలాడుతూ ఉంటుంది.

కుదుళ్లను బలంగా ఉంటేనే జుట్టు దృఢంగా ఉంటుంది. కుదుళ్లను బలోపేతం చేసే శక్తి గ్లిజరిన్‌కు ఉంది. డ్రైనెస్, పొట్టు రేగడం వంటివి దరిచేరకుండా గ్లిజరిన్ జుట్టును కాపాడుతుంది. దురదలు కూడా తగ్గుముఖం పడతాయి.


జుట్టు చివరి భాగం చిట్లి అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. గ్లిజరిన్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనితో జుట్టులో సాగే గుణం పెరిగి చిట్లడం తగ్గుతుంది. వెంట్రుకలు ఒత్తుగా తయారవుతాయి.

గ్లిజరిన్‌తో జుట్టు మృదువుగా కూడా మారుతుంది. దీంతో, తలదువ్వు కోవడం, జడ వేసుకోవడం సులువవుతుంది. ముఖ్యంగా డ్రైనెస్ ఎక్కువగా ఉండే చలికాలంలో గ్లిజరిన్‌తో జుట్టు కొత్త కళను సొంతం చేసుకుంటుంది.

హానికారక సూర్యరశ్మి నుంచి కూడా గ్లిజరీన్ జుట్టును కాపాడుతుంది. హెయిల్ స్టైలింగ్ కోసం వాడే కెమికల్స్, యూవీ కిరణాలు, వాతావరణంలో దుమ్మూ ధూళి వంటివాటి నుంచి జుట్టును రక్షిస్తుంది. జుట్టును లోపలి నుంచి బలోపేతం అయ్యేలా చేస్తుంది.


గ్లిజరీన్‌తో నెత్తిపై పీహెచ్ బ్యాలెన్స్ కూడా నిలిచి ఉంటుంది. ఫలితంగా డాండ్రఫ్, దురదలు వంటి సమస్యలు తలెత్తవు.

గ్లిజరీన్‌లోని యాంటీమైక్రోబియల్ లక్షణాలతో జుట్టుకు, నెత్తికి ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇక ఉంగరాల జుట్టు ఉన్న వారు గ్లిజరిన్ రాసుకుంటే జుట్టు మరింత బౌన్సీగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!

Read Latest and Health News

Updated Date - Apr 17 , 2025 | 09:21 PM