Share News

Zinc Deficiency: ఈ సమస్యలు ఉంటే జింక్‌ లోపం ఉన్నట్టే..

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:24 PM

ఎదుగుదలకు అవసరమైన జింక్ లోపంలో ఉన్న వాళ్లల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Zinc Deficiency: ఈ సమస్యలు ఉంటే జింక్‌ లోపం ఉన్నట్టే..
Zinc Deficiency

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి చాలా తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాల్లో జింక్ కూడా ఒకటి. అనేక జీవ క్రియలకు జింక్ అవసరం. అయితే, జింక్ లోపం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలోనే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, జింక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఐదు ప్రధాన సమస్యలు కనిపిస్తే జింక్ లోపం ఉన్నట్టు భావించాలని చెబుతున్నారు (Zinc Deficiency Symptoms and Treatment).

జింక్‌ లోపం ఉన్న చిన్నారుల్లో ప్రధానంగా కనిపించే సమస్య ఎదుగుల నెమ్మదించడం. కణవిభజన, ఎదుగుదలకు జింక్ ఎంతో అవసరం. ఇది లోపించిన పక్షంలో ఎదుగుదల నెమ్మదిస్తుంది.

జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు జింక్ అవసరం. కాబట్టి, జుట్టుపలచడబడం, త్వరగా పాడవడం వంటివి కనిపిస్తే జింక్ లోపం ఉన్నట్టు అనుమానించాలి. జింక్ లోపం ఉన్న సందర్భాల్లో చర్మం సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ర్యాషెస్ రావడంతో పాటు గాయాలు మానడంలో కూడా జాప్యం కనిపిస్తుంది.


జింక్ లోపం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు, డయేరియా వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం ఉన్న వారు ఇతర పోషకాలు గ్రహించడంలో ఇబ్బంది ఎదుర్కుంటారని కూడా వైద్యులు చెబుతున్నారు.

న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేసే జింక్ తక్కువైనప్పుడు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. చికాకులు, మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి. జింక్ లోపించిన సందర్భా్ల్లో హార్మోన్ సమతౌల్యం దెబ్బతిని మహిళల్లో సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.


ఈలోపంతో బాధపడుతున్న వారు కోడి గుడ్లు, పాలఉత్పత్తులు ఎక్కువగా తింటే కొంత ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పప్పు దినుసులు, బాదంపప్పులు, చియా గింజల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు జింక్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, పురుషులకు రోజుకు 11 మిల్లీ గ్రాములు, మహిళలకు 8 మిల్లీగ్రాములు, గర్భంతో ఉన్న మహిళలు, పసిపిల్లలున్న తల్లులకు ఇంతకంటే ఎక్కువ మొత్తంలోనే జింక్ అవసరం అవుతుంది.

ఇది కూడా చదవండి:

ఎండాకాలంలోనూ జలుబుతో ఇబ్బందులు.. వైద్యులు చెప్పేదేంటంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!

Read Latest and Health News

Updated Date - Apr 11 , 2025 | 03:24 PM