Share News

Cold and Cough in Summer: ఎండాకాలంలోనూ జలుబుతో ఇబ్బందులు.. వైద్యులు చెప్పేదేంటంటే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:55 PM

ఎండాకాలంలో కూడా జలుబు బారిన పడటానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Cold and Cough in Summer: ఎండాకాలంలోనూ జలుబుతో ఇబ్బందులు..  వైద్యులు చెప్పేదేంటంటే..
Cold and Cough in Summer

ఇంటర్నెట్ డెస్క్: మీ ఆఫీసులో సడెన్‌గా జనాలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. దగ్గులు, తుమ్ములతో సతమతవుతున్నారు. పిల్లలూ పడిసెంతో ఇబ్బంది పడుతున్నారా..? ఇదంతా ఎండాకాలంలో జరుగుతోందేమిటనే ఆశ్చర్యం కలుగుతోందా? ఇదేమీ అసాధారణంగా కాదని వైద్యులు చెబుతున్నారు ఇందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.

కారణాలు ఇవే

గంటల వ్యవధిలోనే వాతావరణం వేగంగా మారుతుండటంతో శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రోగనిరోధక శక్తి బలహీనపడుతోంది

అసలే పొడి వాతావరణం, ఆపై నిర్మారణ రంగ కార్యకలాపాల కారణంగా చెలరేగే దుమ్మూధూళీ వంటివి నోరు, ముక్కుల్లో చేరి ఎలర్జీలకు కారణమవుతున్నాయి.

చలికాలం నాటి వైరస్‌లు ఇంకా ఉండటంతో పెళ్లిళ్లు, జర్నీలప్పుడు జలుబులు మొదలువుతన్నాయి.


చలికాలంలో ఎక్కడికీ కదలకుండా కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి రోగ నిరోధక శక్తి బలహీనపడుతోంది. ఋతువు మార్పులను అలవాటు పడటంలో జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు.

కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, ఏసీల్లో గడపడం కూడా శరీరంపై ఒత్తిడిని పెంచి, గొంతు ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతోంది.

ఇలాంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండాలన్నా, జలుబులు, థ్రోట్ ఇన్ఫెక్షన్ల వంటివి త్వరగా తగ్గాలన్నా కొన్ని టిప్స్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటితో పాటు గోరువెచ్చని పానీయాలు, హెర్బల్ టీ, పనుసు పాలు వంటవి తాగితే జలుబు నుంచి త్వరగా కోలుకోవచ్చు. కూల్ డ్రింక్స్ వంటివి తక్కువగా తాగాలి.


ఎక్కువ సేపు ఏసీ గదుల్లో గడపకుండా ఉంటే మంచిది. జలుబుతో ఇబ్బంది పడే వారు ఉన్న చోట మాస్కులు ధరించడం మంచిది. ఇమ్యూనిటీని పెంచే నిమ్మజాతికి చెందిన పండ్లు, అల్లం, వెల్లుల్లి, ఆకు కూరలు వంటివాటితో కూడా మంచి ఫలితం ఉంటుంది. జ్వరం, జలులు, ఒళ్లు నొప్పులు వంటివి 5 -6 రోజుల పాటు నిలిచి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలంలో అనారోగ్యాల నుంచి సులువుగా బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి:

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!

రోజూ 15 నిమిషాల పాటు జాగింగ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..

Read Latest and Health News

Updated Date - Apr 10 , 2025 | 11:55 PM