Health Tips: నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:28 PM
కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips: చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరువెచ్చని పాలు
రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.
గింజలు (బాదం, వాల్‌నట్స్)
గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.
అరటిపండు
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..
తరచూ తుమ్ములా? అలెర్జీ వల్లే కాదు.. ఈ సమస్య కూడా కావచ్చు..!
For More Health News