Share News

Back Pain Causes: వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

ABN , Publish Date - Jun 18 , 2025 | 03:09 PM

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Back Pain Causes: వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..
Back Pain

Back Pain Causes: వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.


Also Read:

తరచూ తుమ్ములా? అలెర్జీ వల్లే కాదు.. ఈ సమస్య కూడా కావచ్చు..!

రోగమేదైనా చికిత్సకు సిద్ధం.

For More Health News

Updated Date - Jun 18 , 2025 | 04:14 PM