Share News

Noise Cancelling Headphones: అలర్ట్.. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడుతారా? అయితే..

ABN , Publish Date - Feb 17 , 2025 | 08:00 AM

నిరంతరం నాయిస్ క్యా్న్సలింగ్ హెడ్‌ఫోన్స్ వాడేవారిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సమస్యలు ఏమిటో, వీటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Noise Cancelling Headphones: అలర్ట్.. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడుతారా? అయితే..

ఇంటర్నెట్ డెస్క్: నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ వాడే అలవాటు ఉందా? ఇవి లేకుండా బయట కాలుపెట్టలేరా? అయితే మీరు రిస్కులో పడ్డట్టే. ఈ అలవాటుతో చెవికి చేటు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్?

ఈ హెడ్‌ఫోన్స్ ధరించినప్పుడు బయటి శబ్దాలు చెవులకు చేరవు. దీంతో, మ్యూజిక్‌ను మరింతగా ఆస్వాదించొచ్చు. అందుకే అనేక మందిని వీటిని నిత్యం వినియోగిస్తుంటారు. అయితే, బయటి శబ్దాలను అడ్డుకోవడంతో ఇతర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు (Health).

ఈ తరహా హెడ్‌ఫోన్స్ కారణంగా పరిసరాల్లో ఏం జరుగుతోందనేది తెలియదు. దీంతో పాటు చెవిలో అసౌకర్యం, ఒత్తిడి, తలనొప్పి, తలతిరిగినట్టు ఉండటం, చివరకు చెవిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశం కూడా ఉంది. నడుస్తూ లేదా ఇతర పనుల్లో ఉన్నప్పుడు ఈ తరహా హెడ్‌ఫోన్స్ అతిగా వాడితే ఈ ప్రమాదాల బారిన పడతారట.


Liver Health: మీకు ఈ అలవాట్లు ఉంటే.. లివర్‌కు ముప్పు పొంచి ఉన్నట్టే

నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ ధరించినప్పుడు బయటి శబ్దాలు చెవుల పడవు. తీంతో, చుట్టూ ఏం జరుగుతోందనేదానిపై అవగాహన ఉండదు. వీధుల్లో నడుస్తున్నప్పుడు ఇలా జరిగితే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. నాయిస్ క్యాన్సిలింగ్‌తో పాటు అత్యధిక శబ్దంలో పాటలు వింటే చెవి వినికిడి శక్తి శాశ్వతంగా తగ్గొచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ నిరంతరం వినియోగిస్తే తలనొప్పులు, తలతిరిగినట్టు ఉండటం కూడా అనిపిస్తుంది. కాబట్టి, వీటి వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.


Wooden Cutting board: కూరలు తరిగేందుకు చెక్క బోర్డు వాడివారికో హెచ్చరిక!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మన పరిసరాల్లో 80 డెసీబెల్స్‌కు మించిన శబ్దాలు ఉండకూడదు. ఇక పనిప్రదేశాల్లో శబ్దాలకు 85 డెసీబెల్స్ వరకూ పరిమితి ఉంది. కాబట్టి, ఈ పరిమితులు దాటకుండా ఉంటే చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఈ సమస్యలేవీ రాకుండా ఉండాలంటే నాయిస్ క్యాన్సిలింగ్ ఫోన్స్ వాడే వారు ఓ మోస్తరు సౌండ్‌తోనే పాటలు, ఇతర మ్యూజిక్‌ను వినాలి. రోజుకు గంటకు మించి హెడ్‌ఫోన్స్ వాడొద్దు. ఇక ఇయర్ బడ్స్‌కు బదులు ఓవర్-ది-ఇయర్ హెడ్‌ఫోన్స్ వినియోగం చెవులకు శ్రేయస్కరం. నిరంతరం హెడ్‌ఫోన్స వాడకుండా అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకుంటే చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక మంచి నాణ్యత ఉన్న హెడ్‌ఫోన్స్‌తో చెవ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!

Read Latest and Health News

Updated Date - Feb 17 , 2025 | 08:00 AM