Infertility in Women: ఆలస్య వివాహం.. స్త్రీల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది..
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:32 PM
మహిళల్లో సంతానలేమికి ఆలస్య వివాహం ఒక కారణమా? ఆలస్య వివాహం స్త్రీల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఏ వయస్సులో దంపతులు పిల్లలను ప్లాన్ చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Infertility in women: ఈ రోజుల్లో 'పెళ్లి' అంటేనే వద్దు రా బాబు అంటున్నారు నేటి కాలం యువతి యువకులు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ కూడా ఆలస్యంగా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. గతంలో వివాహాలు 22 నుండి 25 సంవత్సరాల వయస్సులో జరిగేవి. కానీ, ఇప్పుడు ఈ వయస్సు 30-32 సంవత్సరాలకు పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నారు. మొదట చదువులు, తరువాత ఉద్యోగాలు, ఆ తర్వాత కొంతకాలం స్వేచ్ఛగా జీవితాన్ని గడిపి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.
అయితే, లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల జంటలలో సంతానలేమి సమస్య ఎక్కువగా పెరుగుతోంది. సంతానలేమికి వయస్సు అతిపెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు, చెడు జీవనశైలి, కొన్ని వైద్య పరిస్థితులు కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే, సంతానలేమి పెరగడానికి గల కారణాలు ఏంటి? ఆలస్యంగా వివాహం చేసుకోవడమే ఇందుకు కారణమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనం గమనించినట్లయితే గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. ఫలితంగా, చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత అంత త్వరగా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. ఇది వారికి స్వేచ్ఛ, వ్యక్తిగత స్థిరత్వాన్ని ఇచ్చింది. కానీ, దీని కారణంగా మహిళ్లలో సంతానోత్పత్తి తగ్గుతుంది.
స్త్రీలలో సంతానోత్పత్తికి సరైన వయస్సు
స్త్రీలలో సంతానోత్పత్తికి ఉత్తమ వయస్సు 32 సంవత్సరాల ముందు అని నిపుణులు చెబుతున్నారు. 32 సంవత్సరాల వయస్సు నుండి సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కేవలం వయస్సుకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే, శరీరంలో సహజ పునరుత్పత్తి ప్రక్రియలు నెమ్మదిస్తాయి. వయస్సుతో పాటు ఆరోగ్యకరమైన అండాల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి, ప్రెగ్నెన్సీని 32 వయసు లోపు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read:
Vastu Tips: ఇంట్లో గొడవలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వస్తువులు ఇంట్లో ఉంచితే గొడవలు దూరం..
Star Tortoise: అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..
Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..