Share News

Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:30 PM

Pahalgam Terror Attack: ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించడంతో.. భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో సింధు నది జలాలు.. భారత్, పాక్ మధ్య ఎప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది. తదితర విషయాలు తెలుసుకోవాలంటే..

Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..

జమ్మూ కాశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది మరణించడంతో పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్‌ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంభించింది. అందులోభాగంగా భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటి బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్రం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొంది. దాదాపు 65 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌తో భారత్ చేసుకొన్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

సింధు జలాలు ఒప్పందం ఏమిటంటే..

1) 1960, సెప్టెంబర్ 19వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు సంతకం చేసింది. తొమ్మిది సంవత్సరాల చర్చలు అనంతరం ఈ రెండు దేశాలు.. ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

2) ఈ ఒప్పందం అనేక సరిహద్దు నదుల జలాల వినియోగంపై ఇరుపక్షాల మధ్య సహకారంతోపాటు సమాచార మార్పిడి కోసం ఒక యంత్రాంగాన్ని నిర్దేశిస్తుంది.


3) ఆరు ఉమ్మడి నదులను నియంత్రించే ఒప్పందం ప్రకారం.. తూర్పు నదులైన సట్లెజ్,బియాస్, రావిల నదీ జలాలను ఏడాదికి 33 మిలియన్ ఎకరాల అడుగులు వాడుకోవచ్చని.. దీనిని భారత్ అపరిమితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది.

4) పశ్చిమ నదులైన సింధు,జీలం, చీనాబ్‌ నదీ జలాలను.. ఏడాదికి సుమారు 135 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని పాకిస్తాన్‌కు కేటాయించారు.


5) ఈ ఒప్పందం ప్రకారం, డిజైన్, ఆపరేషన్ కోసం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి పశ్చిమ నదులపై నదీ ప్రాజెక్టుల ద్వారా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే హక్కును భారత్‌కు కట్టబెట్టింది.

6) ఇక పశ్చిమ నదులపై భారత జలవిద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కును సైతం పాకిస్థాన్‌కు ఈ ఒప్పందం కల్పించింది.


7) ఈ ఒప్పందం ప్రకారం.. ఇద్దరు కమిషనర్లు కనీసం ఏడాదికి ఒకసారి.. భారత్, పాక్‌లో ఎక్కడో ఒక చోట సమావేశం కావాల్సి ఉంది. ఆ క్రమంలో 2020,మార్చి‌లో ఈ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ విజృంభించడంతో.. ఈ సమావేశం రద్దు చేయబడింది. నాటి నుంచి ఈ సమావేశం జరగక పోవడం గమనార్హం.

8) ఒప్పందంలోని నిబంధనలను కాలానుగుణంగా ఇరు దేశాల్లోని ప్రభుత్వాల మధ్య ప్రయోజనం కోసం ఈ ఒప్పందాన్ని సవరించుకోవచ్చు.


9)

ఈ ఒప్పందంలోని ఉపోద్ఘాతం ఏం చెబుతోందంటే.. సింధు వ్యవస్థ నదుల జలాలను అత్యంత పూర్తి‌గా,తృప్తికరంగా ఉపయోగించుకోవాలని భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు సమానంగా కోరుకుంటున్నాయి. అందువల్ల, ఈ జలాల వినియోగం గురించి ఒకరికొకరు సంబంధించి ఒకరి హక్కులు, బాధ్యతలను సద్భావన, స్నేహ స్ఫూర్తితో నిర్ణయించడం, అలాగే డీలిమిటేషన్ చేయవలసిన అవసరాన్ని గుర్తించాయి. ఇక్కడ అంగీకరించబడిన నిబంధనల యొక్క వివరణ లేదా అన్వయానికి సంబంధించి ఇకపై తలెత్తే అన్ని ప్రశ్నలకు సహకార స్ఫూర్తితో పరిష్కారం కోసం ఏర్పాట్లు చేశాయి.

10)

ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ఖాన్‌లు సంతకం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి

Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 12:56 PM