Share News

Diabetes-Low BP Risk: బీపీ తక్కువగా.. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.. లేకపోతే..

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:31 PM

డయాబెటిస్‌కు లోబీపీ తోడయితే అనారోగ్యాల రిస్క్ ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ రోగులు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరి వైద్యులు చెబుతున్న జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Diabetes-Low BP Risk: బీపీ తక్కువగా.. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.. లేకపోతే..
Diabetes Low Blood Pressure risk

ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ అనగానే మనలో చాలా మందికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు గుర్తొస్తాయి. కానీ ఇలాంటి వాళ్లల్లో ఒక్కోసారి బీపీ తక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండింటి కాంబో ప్రమాదాల ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి, బీపీ తగ్గడానికి వెనక కొన్ని కీలక మార్పులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు (diabetes low blood pressure risk).

షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు..

సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం.. ఈ అదనపు చక్కెరను వదుల్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. ఈ క్రమంలో శరీరం నుంచి అధికంగా నీరు బయటకుపోతుంది. ఈ క్రమంలో రక్తంలో కూడా నీరు తగ్గి బీపీ తగ్గుతుంది. చివరకు రోగులు డీహైడ్రేషన్ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి, మెదడుకు ఆక్సిజన్, ఇతర పోషకాలు అందక రోగులు నిరసనపడతారు. కొందరిలో తలతిరుగుతున్నట్టు అనిపించడం, నీరసం, చూపు మసకబారినట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరు మూర్ఛపోతారు కూడా (high sugar dehydration BP drop).


డయాబెటిస్ రోగుల్లో కొందరికి అటానమిక్ న్యూరోపతి అనే మరో సమస్య కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్లల్లో నాడులు దెబ్బతిని బీపీపై నియంత్రణ తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో అకస్మాత్తుగా లేచినా, కూర్చొన్నా బీపీలో మార్పులు వచ్చి తలతిరగటం, మూర్ఛపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వృద్ధుల్లో ఇలాంటి సమస్యలు ఉంటే వారు కింద పడి ఎముకలు విరిగే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది (diabetic patients dizziness fainting).

ఇది గుండె, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, డయాబెటిక్ రోగులు బీపీ నియంత్రణ కోసం తగినంత నీరు తాగాలి. నిత్యం, బీపీ, చక్కెర స్థాయిలపై ఓ కన్నేసి ఉంచాలి. సడెన్‌గా లేవడం, కూర్చోవడం వంటివి చేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, బీపీ పడిపోయి తలతిరుగుతున్నట్టు, మూర్ఛపోతున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించే ఈ 2 కీలక టెస్టుల గురించి తెలుసా..

హెచ్‌బీఏ1సీ, ఎస్ఎమ్‌బీజీ.. డయాబెటిస్ రోగులకు తప్పనిసరిగా తెలిసుండాల్సిన విషయాలు ఇవి..

Read Latest and Health News

Updated Date - Sep 12 , 2025 | 05:48 PM