Stomach Pain : ఏఏ కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది..
ABN , Publish Date - May 15 , 2025 | 08:23 AM
Somach Pain Reasons: కడుపులో వివిధ ప్రాంతాల్లో వచ్చే నొప్పి శరీరంలో వేర్వేరు అవయవాల పనితీరు మందగించిందనేందుకు సంకేతం. కాలేయం నుంచి మూత్రాశయం వరకూ ఏ అవయవంలో సమస్య ఉన్నా కడుపు నొప్పి ద్వారా కనిపెట్టవచ్చు.
Abdominal Pain Causes: శరీరంలో ఏ భాగంలో తరచూ నొప్పి వస్తున్నా ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. బాడీలో ఒక నిర్దిష్ట భాగం పదే పదే బాధిస్తుంటే మీరు అనారోగ్యానికి గురైనట్టే అర్థం.ఇక చాలా మంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. కానీ ఎవరూ కడుపులో ఎటువైపు నొప్పి వస్తుంది అనే విషయాన్ని సరిగ్గా పట్టించుకోరు. నొప్పికి కారణమేంటో తెలీకపోయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే టాబ్లెట్ వేసేసుకుంటారు. నిజానికి, కడుపులో ఏ భాగం బాధిస్తుంది అన్న సంగతి నిర్ధారించుకున్న తర్వాతే మందులు వేసుకోవాలి. ఎందుకంటే, కడుపులో ఒక్కో వైపు వచ్చే నొప్పి శరీరంలోని ఒక్కో భాగం పనితీరు దెబ్బతినిందని చెప్పేందుకు సూచన. కాలేయం నుంచి మూత్రాశయం వరకూ శరీరంలోని కొన్ని అవయవాల సమస్యలను కడుపు నొప్పి ద్వారా గుర్తించవచ్చు.
ఉదరం కుడి వైపున నొప్పి
పిత్తాశయం పనితీరు మందగించడం వల్ల కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి వస్తుంది. అయితే, ఈ నొప్పి కాలేయం సమస్యను సూచించదు.
కడుపులో ఎడమ వైపు నొప్పి
ఛాతీ కింద కడుపు ఎగువ ఎడమ భాగంలో నొప్పి ఉంటే అది క్లోమంలో సమస్యకు సంకేతం కావచ్చు. ఈ రకమైన నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఉదరం మధ్యలో నొప్పి
మీకు తరచుగా కడుపు మధ్యలో నొప్పి అనిపిస్తే అది పుండుకు సంకేతం కావచ్చు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నొప్పి రాదు.
నాభి దగ్గర నొప్పి
బొడ్డు దగ్గర నొప్పి ఉంటే అది మూత్రాశయ వ్యాధికి సంకేతం. కాబట్టి పొత్తి కడుపులో నొప్పిని విస్మరించకండి. వెంటనే చెకప్ చేయించుకోండి.
అపెండిసైటిస్ నొప్పి
కడుపులో కుడివైపు కింది భాగంలో నొప్పి ఉంటే అది అపెండిసైటిస్ లక్షణం కావచ్చు. ఇలాంటి నొప్పి తరచూ వస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి.
మలబద్ధకం నొప్పి
కడుపు దిగువ భాగాన ఎడమ వైపు నొప్పి ఉంటే మలబద్ధకం లక్షణాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
Read Also: Foot Pain: తరచూ కాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. అయితే, ఇదే కారణం కావచ్చు..
Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..
Health Tips: హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..