Share News

Sleeping Divers Trend: స్లీపింగ్ డైవర్స్ ట్రెండ్.. దీని గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Jan 27 , 2025 | 07:20 AM

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. విదేశాల్లో పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. భారతదేశంలో మాత్రం వేదమంత్రాల సాక్షిగా నిండు నూరేళ్లూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి దానికి కట్టుబడి ఉంటారు.

Sleeping Divers Trend: స్లీపింగ్ డైవర్స్ ట్రెండ్.. దీని గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. విదేశాల్లో పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. భారతదేశంలో మాత్రం వేదమంత్రాల సాక్షిగా నిండు నూరేళ్లూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి దానికి కట్టుబడి ఉంటారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రజలు విదేశీ సంస్కృతి బాట పడుతున్నారు. ఇటీవల కాలంలో పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తలు విడిపోతుంటే తాజాగా మరో కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది. కలిసి ఉండి కూడా విడిగానే ఉంటున్నారు. అదేంటనుకుంటున్నారా? అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..


అసలేంటీ స్లీపింగ్ డ్రైవర్స్ ట్రెండ్?

ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం స్లీపింగ్ డైవర్స్. అంటే నిజమైన విడాకులు కాదండోయ్.. భార్యభర్తలు ఇద్దరూ రెండు వేర్వేరు గదుల్లో పడుకోవడం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు చాలా జంటలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఒకే గదిలో కలిసి పడుకుని చీటికిమాటికీ గొడవలు పడే కన్నా విడివిడిగా పడుకోవడమే మంచిదని కొంతమంది భావిస్తున్నారు. నిద్ర విషయంలోనూ భాగస్వామిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ట్రెండ్ అనుసరిస్తున్నారు.


ఇందుకేనా?

రాత్రివేళ కలిసి పడుకునే సమయంలో గొడవలు వస్తున్నాయని కొన్ని జంటలు భావిస్తున్నాయి. ఒకే గదిలో పడుకుంటే ఏదో ఒక విషయంలో డిస్కర్షన్ మెుదలై చివరికి అది కొట్లాటకు దారి తీస్తుందని నమ్ముతున్నారు. అలాగే ఒకరు నిద్రపోతుంటే మరొకరు అర్ధరాత్రి వరకూ సెల్ ఫోన్ చూస్తూ భాగస్వామిని ఇబ్బంది పెడుతున్నారని ఈ ట్రెండ్ ఫాల్ అయ్యే వారు చెబుతున్నారు. ఒకరికి కౌగిలించుకుని పడుకునే అలవాటు ఉంటే, మరొకరికి అది నచ్చడం లేదని అంటున్నారు. గురకపెట్టే అలవాటు, ఒకే దుప్పటి కప్పుకునే విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అందుకే భాగస్వామిని ఇబ్బంది పెట్టకుండా ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి సపరేట్ రూమ్స్‌ ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. దీని వల్ల రాత్రివేళ గొడవలు రాకుండా మిగతా సమయాల్లో సంతోషంగా కలిసి జీవించొచ్చని అంటున్నారు.


మంచిది కాదా?

అయితే మానసిక వైద్యులు మాత్రం ఇలాంటి ట్రెండ్ మంచిది కాదని చెబుతున్నారు. భాగస్వామితో కలిసి పడుకోవడం వల్ల చిన్నచిన్న సమస్యలు వచ్చినా వారిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా ఉండేందుకు కలిసి పడుకోవడమే ఉత్తమమని అంటున్నారు. దీని వల్ల తమ భాగస్వామి ఎలాంటి వారో, ప్రవర్తన ఎలా ఉంటుంది, వారితో కలిసి జీవించేందుకు మనం ఎలా మారాలి లేదా భాగస్వామిలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎలా సరిదిద్దాలనే విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు. కొన్ని జంటలు అనుసరించే ఈ విధానం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

Updated Date - Jan 27 , 2025 | 07:20 AM