Peeling Skin on Hands: మీ వేళ్లపై చర్మం ఊడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:04 AM
చేతులపై చర్మం ఊడిపోవడం అనేది ఒక సాధారణ సమస్య. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, వేళ్లపై చర్మం ఎందుకు ఊడిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Peeling Skin: చేతివేళ్లపై చర్మం ఊడిపోవడం అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. పొడిబారడం, మారుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు వంటి వివిధ కారణాల వల్ల వేళ్లపై చర్మం ఊడిపోవడం జరుగుతుంది.
పొడి చర్మం
పొడి చర్మ సమస్యలు ఉన్నవారికి చేతులపై చర్మం ఊడిపోవడం సర్వసాధారణం. చల్లని గాలికి గురికావడం, తేమ లేకపోవడం లేదా సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి.
రసాయనాలకు గురికావడం
గృహ శుభ్రపరిచే ఉత్పత్తులు, డిటర్జెంట్లు లేదా కఠినమైన రసాయనాలు కలిగిన సబ్బులు చర్మం రక్షణ పొరను దెబ్బతీస్తాయి. దీని వల్ల వేళ్లపై చర్మం ఊడిపోవడం జరుగుతుంది.
అలెర్జీలు
పెర్ఫ్యూమ్‌లు లేదా సౌందర్య సాధనాలు వంటి కొన్ని పదార్థాలకు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయి. అవి చేతుల చర్మంపై దురదకు కారణమవుతాయి.
సూర్య కిరణాల ప్రభావం
ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగలవచ్చ, దీనివల్ల చర్మం ఊడిపోవడం, ఎరుపు రంగు రావడం, వేడిగా అనిపించడం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిర్జలీకరణం
తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఇది చేతులు, ముఖ్యంపై పొట్టు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
విటమిన్ లోపం
విటమిన్ బి3(నియాసిన్), విటమిన్ డి వంటి కొన్ని విటమిన్ల లోపం వల్ల చేతులపై చర్మం ఊడిపోతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి.
చర్మ తేమను కాపాడుకోవడానికి గ్లిజరిన్, లానోలిన్ లేదా షియా బటర్‌తో కూడిన మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి.
మీ చేతులను గోరువెచ్చని నీటితో కడుక్కోండి. శుభ్రమైన టవల్‌తో వాటిని సున్నితంగా తుడుచుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: ఈ ఆకు తింటే మీరు మళ్ళీ యవ్వనంగా మారతారు..