Share News

Cancer in Women: మహిళల్లో పెరుగుతోన్న క్యాన్సర్ ప్రమాదం..

ABN , Publish Date - May 29 , 2025 | 03:48 PM

గ్లోబల్ వార్మింగ్ వల్ల మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఉత్తర ఆఫ్రికాలో గ్లోబల్ వార్మింగ్ వల్ల రొమ్ము, అండాశయం, గర్భాశయ క్యాన్సర్‌లు మరింత సాధారణమై ప్రాణాంతకం అవుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 Cancer in Women: మహిళల్లో పెరుగుతోన్న క్యాన్సర్ ప్రమాదం..
Cancer

Cancer: ఉత్తర ఆఫ్రికాలో గ్లోబల్ వార్మింగ్ వల్ల రొమ్ము, అండాశయం, గర్భాశయ క్యాన్సర్‌లు మరింత సాధారణమై ప్రాణాంతకం అవుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదంతో మరణాల సంఖ్య మరింత పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, మహిళల్లో క్యాన్సర్ మరణాలు కూడా పెరుగుతాయని.. ముఖ్యంగా అండాశయ, రొమ్ము క్యాన్సర్‌లు పెరుగుతాయని అంటున్నారు.


విపరీతమైన వాయు కాలుష్యం

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఆహారం, నీటి భద్రత దెబ్బతినడం, గాలి నాణ్యత సరిగా లేకపోవడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు, మరణాల సంఖ్యను పెంచుతాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని వాతావరణ పరిస్థితులు మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతీస్తాయని ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు అంటున్నారు. విపరీతంగా పెరుగుతోన్న వాయు కాలుష్యం కారణంగా మహిళల్లో క్యాన్సర్‌ ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

లక్ష మందిలో 173-280 కేసులు

ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే క్యాన్సర్ ప్రభావం లక్ష మందిలో 173-280 కేసులు పెరుగుతాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతాయని, రొమ్ము క్యాన్సర్ కేసులు తక్కువగా పెరుగుతాయని అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రతి డిగ్రీకి లక్ష మందిలో 171-332 మరణాల సంఖ్య పెరిగిందన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ మహిళల్లో క్యాన్సర్ మరణాలు కూడా పెరుగుతాయన్నారు.


అట్టడుగు స్థాయి మహిళలు పర్యావరణ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారని నిపుణులు తెలిపారు. క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను సరైన సమయంలో గుర్తించి మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. ఎందుకంటే క్యాన్సర్‌కు ప్రారంభ దశలో చికిత్స చేయడం సులభం అవుతుందని చెబుతున్నారు.


Also Read:

పోలీసుల అదుపులో మావో కీలక నేత హిడ్మా

పుట్‌పాత్‌పై యువకుడ్ని చావగొట్టిన ముగ్గురు యువతులు..

For More Telugu And National News

Updated Date - May 29 , 2025 | 04:47 PM