Coconut Water Benefits: కిడ్నీ పేషెంట్స్, డయాబెటిస్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?
ABN , Publish Date - Dec 09 , 2025 | 09:08 AM
కొబ్బరి నీళ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. మూత్రపిండాలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అయితే.. మూత్రపిండాలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
నిపుణుల ప్రకారం.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు గుండె ఆరోగ్యం, ఎముకలు, కండరాల పనితీరుతో సహా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్
కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్లు) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి, మూత్రాన్ని పలుచన చేసి, రాళ్లు కరగడానికి సహాయపడుతుంది. అయితే, ఇది పూర్తి చికిత్స కాదు.. డాక్టర్ సలహా ముఖ్యం. ఇది రాళ్లను కరిగించకపోయినా, వాటిని నివారించడంలో లేదా ఉన్నవి బయటకు వెళ్ళడానికి సహాయపడే ఒక సహజ పద్ధతి. కానీ పొటాషియం ఎక్కువగా ఉన్నందున, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందా?
కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్‌తో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం అదనపు ప్రయోజనాలను అందిస్తుందని వివరిస్తున్నారు. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే, మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారు, పొటాషియం తీసుకోవడం తగ్గించుకోవాల్సిన వారు దీనిని తాగకుండా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, డయాబెటిస్ ఉన్నవారు తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
(Note: ఇందులోని సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
స్త్రీలను ఆకర్షించే పురుషుల లక్షణాలు ఇవే!
రోజుకు ఎన్ని గంటలు నడవాలో తెలుసా?
For More Latest News