Share News

Cancer deaths India: భారత్‌లో క్యాన్సర్ మరణాలు.. ఈ క్యాన్సర్లే ఎక్కువగా కబళిస్తున్నాయి..

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:06 PM

భారతదేశంలో కూడా క్యాన్సర్ మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ఎక్కువ మరణాలకు కారణమవుతోంది. భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు సంబంధించిన సమాచారాన్ని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వెల్లడించింది.

Cancer deaths India: భారత్‌లో క్యాన్సర్ మరణాలు.. ఈ క్యాన్సర్లే ఎక్కువగా కబళిస్తున్నాయి..
cancer deaths India

భారతదేశంలో క్యాన్సర్ మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ (breast cancer India) ఎక్కువ మరణాలకు కారణమవుతోంది. భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు సంబంధించిన సమాచారాన్ని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) వెల్లడించింది. భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా రొమ్ము క్యాన్సర్ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్ ఉన్నాయి. ది లాన్సెట్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది (Lancet cancer study).


లాన్సెట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధుల తర్వాత రెండో ప్రధాన మరణ కారణంగా క్యాన్సర్ ఉంది (leading cancer types). రాబోయే దశాబ్దాలలో ఇది మరింత ఎక్కువగా పెరుగుతుందని లాన్సెట్ అంచనా వేసింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 1.85 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. కోటి క్యాన్సర్ మరణాలు సంభవించాయి. ఈ కేసులు, మరణాలలో దాదాపు మూడింట రెండు వంతులు మధ్య ఆదాయ దేశాలలోనే సంభవిస్తున్నాయి. పొగాకు వినియోగం, ఆహారం, ఇన్ఫెక్షన్లు, కాలుష్యం వంటి ప్రమాద కారకాలు క్యాన్సర్ మరణాలలో 40 శాతం కంటే ఎక్కువ ఉన్నాయి.


2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు 3 కోట్లకు, కేన్సర్ మరణాలు 1.8 కోట్లకు చేరుకుంటాయని లాన్సెట్ అంచనా వేస్తోంది (cancer statistics India). అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే తక్కువ ఆదాయ, మధ్య ఆదాయ దేశాలలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం పేర్కొంది. 2030 నాటికి అంటువ్యాధి కాని వ్యాధుల మరణాలను మూడింట ఒక వంతు తగ్గించాలని ఐక్యరాజ్య సమతి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం అని తాజా అధ్యయనం సూచిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?

షాకింగ్ రిపోర్ట్.. పుట్టుకతోనే 41,000 మంది పిల్లలకు గుండె జబ్బులు

For More Health News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 12:06 PM