Share News

Bathroom Falling Risk: మీ ఇంట్లో చాలా డేంజరస్ ప్రదేశం ఏదో తెలుసా.. కార్డియాలజిస్టు వీడియో వైరల్

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:02 PM

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇంట్లో బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. ఇలా ఎందుకో ఆయన వివరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Bathroom Falling Risk: మీ ఇంట్లో చాలా డేంజరస్ ప్రదేశం ఏదో తెలుసా.. కార్డియాలజిస్టు వీడియో వైరల్
Bathroom Danger Health

ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఒకటి ఉందని తెలుసా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇలాంటి ప్రదేశం ప్రతి ఇంట్లో ఉంటుందని డా.డిమిట్రీ యరనావ్ అనే కార్డియాలజిస్టు తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో చెప్పుకొచ్చారు. ఇక్కడే అత్యధిక మరణాలు సంభవిస్తుంటాయని కూడా అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బాత్రూమ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా తెలిపారు (Bathroom Danger Health).

దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్లు బాత్రూమ్‌లో అపాయాన్ని ఎదుర్కొంటారని డా.యరనావ్ చెప్పుకొచ్చారు. ఏటా వేల మంది బాత్రూమ్‌లల్లో తలతిరిగి కింద పడి మరణిస్తున్నారని అన్నారు. మలబద్ధకం ఉన్న వారు బలవంతంగా మలవిసర్జనకు ప్రయత్నిస్తే ఒక్కోసారి శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఛాతిపై ఒత్తిడి పెరిగి, బీపీ తగ్గి మెదడుకు రక్తసరఫరా నిలిచిపోతుందని డా.యరనావ్ వివరించారు. చివరకు తల తిరిగినట్టు అనిపించి బాత్రూమ్‌లో పడి మరణించే అవకాశాలు ఎక్కువని చెప్పారు (risk fainting in bathroom).

గుండెజబ్బులు, అరిథ్మియా, లేదా గుండె జబ్బుల నిరోధక ఔషధాలు వాడే వారు బాత్రూమ్‌లో ప్రమాదం ఎక్కువ ఎదుర్కొంటారని వివరించారు. ఇలాంటి వాళ్లల్లో సహజంగానే బీపీ తక్కువగా ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు (straining constipation heart risk).


ఈ సమస్యకు పరిష్కారంగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలని చెప్పారు. శరీరానికి కాస్తంత అయినా శ్రమ కలిగేలా కసరత్తులు చేయాలని అన్నారు. మలబద్ధకాన్ని అసలేమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. దీని వల్ల అసౌకర్యంతో పాటు ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

బాత్రూమ్‌లలో జారకుండా ఉండేందుకు మంచి టైల్స్ ఏర్పాటు చేసుకోవాలి. పట్టుకుని లేచేందుకు వీలుగా గోడలకు వీలైన చోటల్లా గ్రాబ్ బార్స్‌ను ఏర్పాటు చేయాలి. బాత్రూమ్‌లో తగినంత వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్త తీసుకోవడం కూడా తప్పనిసరి. బాత్రూమ్‌లో వెలుతురు ఎక్కువగా ఉండేలా లైట్స్ ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా వరకూ ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

స్వీట్స్ తినకపోయినా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

హార్ట్ ఎటాక్ ముప్పును గుర్తించే ఈ 2 కీలక టెస్టుల గురించి తెలుసా..

Read Latest and Health News

Updated Date - Sep 19 , 2025 | 01:11 PM